ఏపీలో ఆటో డ్రైవర్ల పథకానికి కొత్త పేరు ఇదే..! రేపటి నుంచి ఈ ప్రక్రియ ..!

ఏపీలో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం తొలుత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 10 వేల రూపాయల చొప్పున ఇచ్చిన వాహన మిత్ర పథకం కొనసాగించాలని భావించింది. అయితే ఆ తర్వాత ఆటో మిత్రగా కూడా మార్చాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త పేరును ఖరారు చేశారు. ఈ పేరుతోనే కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు సాయం అందించబోతోంది.

ఆటో, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు అక్టోబర్ 1 నుంచి కూటమి ప్రభుత్వం ఏడాదికి ఒకసారి ఇచ్చే 15 వేల రూపాయల సాయానికి "ఆటో డ్రైవర్ల సేవలో" అనే కొత్త పేరు ఖరారు చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వెబ్ సైట్ లో ఈ కొత్త పథకం పేరును ప్రభుత్వం చేర్చింది. దీంతో ఆటో డ్రైవర్ల నుంచి ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ, లబ్దిదారుల ఎంపిక, వారికి 15 వేల సాయం పంపిణీ అన్నింటినీ ఇకపై ఈ పేరుతోనే చేపట్టనున్నారు.

ap government finalised auto driver sevalo name to 15k assistance scheme to auto max cab owners

ఆటో డ్లైవర్లకు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లుగా ఉన్న యజమానులకు ప్రభుత్వం ఈ 15 వేల రూపాయల పథకాన్ని అమలు చేయబోతోంది. ఇందుకోసం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వీటి ప్రకారం సొంత ఆటో లేదా మ్యాక్సీ క్యాబ్ ఉండి స్వయంగా నడుపుకుంటున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేయనున్నారు. అలాగే మరికొన్ని షరతులు కూడా పెట్టారు. వీటి ప్రకారమే ఆటో డ్రైవర్లకు, మ్యాక్సీ క్యాబ్ డ్లైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేయబోతున్నారు. దీంతో వారంతా ఈ కొత్త పథకంపై అవగాహన పెంచుకుని, ఆ పేరుతోనే సచివాలయ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.

ap government finalised auto driver sevalo name to 15k assistance scheme to auto max cab owners
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అర్హులైన ఆటో రిక్షా, మోటారు క్యాబ్‌, మ్యాక్సీక్యాబ్‌ల డ్రైవర్లు సచివాలయాల శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 19 వరకూ అందిన దరఖాస్తులపై గ్రామ,, వార్డు సచివాలయాల సిబ్బంది 22వ తేదీన క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఎంపీడీఓలు, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌లు వీటి తుది జాబితాలను కలెక్టర్లకు పంపుతారు. అర్హుల జాబితాను ఈ నెల 24వ తేదీన ప్రకటిస్తారు. ఈ పథకానికి అర్హులుగా ఎంపికైన వారికి దసరా పండుగ రోజు అంటే అక్టోబర్ 1న బ్యాంకుల్లో 15 వేల నగదు జమ చేస్తారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+