వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అండ్ టీమ్ కు బిగుస్తున్న ఉచ్చు: ఏపీ సిట్ కు విశేషాధికారాలు ఇచ్చిన సర్కార్

|
Google Oneindia TeluguNews

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరినైనా విచారణ చేసేందుకు సిట్‌కు సంపూర్ణ అధికారాలు ఇవ్వడం రాజకీయంగా ఏపీలో దుమారం రేపనుంది. అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలేది లేదని తేల్చి చెప్తుంది ఏపీ సర్కార్ . టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేసిన జగన్ సర్కార్ సిట్ కు విశేషాధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | 5 Key Deals Between India & USA | Oneindia Telugu

సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్ సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్

రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తెస్తూ జీవో

రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తెస్తూ జీవో

ఎక్కడా లేని విధంగా అసాధారణ రీతిలో సిట్‌నే పోలీస్ స్టేషన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక విచారణకు ఎలాంటి అవాంతరం కలగకుండా విచారణ నిమిత్తం రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తెస్తూ జీవో జారీ చేసింది. ఏపీ సర్కార్ గత ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సిట్ కు విశేషాధికారాలు ఇచ్చింది. ఇక జీవోలో చెప్పిన దాని ప్రకారం ఎవరినైనా విచారణకు పిలిచి ప్రశ్నించే, దర్యాప్తు చేసే అధికారం ఉంటుంది.

సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు

సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు

సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. దీంతో సిట్ బృందం రాష్ట్రంలో ఎక్కడనైనా తిరిగి విచారించే అధికారాలు కలిగి ఉంటుంది.ఇక దీంతో చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులలో జరిగిన అవినీతి , ఏర్పడిన సంస్థలు, కార్పొరేషన్లతో పాటు అన్నింటిపైనా సమగ్ర విచారణకు చేసే అధికారం సిట్‌కు కల్పించినట్టు అయింది.

 ఎవర్నీ వదిలేది లేదు.. సిట్ కు ఎవర్నైనా సరే విచారణ చేసే సంపూర్ణ హక్కులు

ఎవర్నీ వదిలేది లేదు.. సిట్ కు ఎవర్నైనా సరే విచారణ చేసే సంపూర్ణ హక్కులు

ఇక ఈ విచారణలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేలా చూడటం కోసం ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, నిందితులు సిట్ ఎక్కడికి విచారణ నిమిత్తం రమ్మని కోరితే అక్కడికి వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇక వారు విచారణ తప్పించుకునే పరిస్థితి లేకుండా వాయిదా వెయ్యటానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకునే వెసులుబాటును జీవో ద్వారా కల్పించింది సర్కార్ .

చంద్రబాబు తో పాటు మాజీ మంత్రులకు బిగుస్తున్న ఉచ్చు

చంద్రబాబు తో పాటు మాజీ మంత్రులకు బిగుస్తున్న ఉచ్చు

చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గంలోని పలువురికి ఉచ్చు బిగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు పాలనలో ప్రాజెక్ట్ ల విషయంలోనే కాకుండా, రాజధాని అమరావతి ప్రాంతంలోని భూముల వ్యహారాలపై వచ్చిన ఆరోపణలపై కూడా సిట్ విచారణ చేయనుంది. దీంతో ఇది ఏపీ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది.

సిట్ పరిధిలోనే సీఆర్డీఏ పరిధిలోని భూ అక్రమాలపై విచారణ

సిట్ పరిధిలోనే సీఆర్డీఏ పరిధిలోని భూ అక్రమాలపై విచారణ


సీఆర్డీఏ రీజియన్ లో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. ఇక ఆ వ్యవహారాన్ని కూడా సిట్ విచారించనుంది. ఆ లావాదేవీలతో సంబంధం ఉన్న ఏవ్యక్తులనునైనా అధికారులైనా సరే విచారణకు పిలిచే అధికారం సిట్‌కు ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చంద్రబాబుతో పాటు నాటి మంత్రులు, టీడీపీలోని కొందరు ముఖ్యనేతలు కూడా సిట్ విచారణను ఎదుర్కొనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

English summary
Another important decision was made by AP government. Giving SIT absolute powers to prosecute anyone is politically abusive. AP government concludes that no one has been left behind. government set up SIT for the TDP regime corruptionand gave special powers .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X