వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ మున్సిపల్‌ పోరుకు లైన్‌ క్లియర్‌- సర్కారు, ఎస్ఈసీ ఓకే -జడ్పీటీసీ, ఎంపీటీసీపై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగియగానే మిగిలిన స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా పూర్తి చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో గతంలో వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఎస్ఈసీని కోరుతూ ప్రభుత్వం రాతపూర్వక అంగీకారం తెలిపింది. దీంతో ఎస్‌ఈసీ కూడాఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మున్సిపల్‌ పోరుకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనే ఉత్కంఠ నెలకొంది.

కొడాలి కామెంట్స్‌పై నిమ్మగడ్డ సీరియస్‌- రెచ్చగొట్టే వ్యాఖ్యలపై షోకాజ్‌ నోటీసు- వివరణకు డెడ్‌లైన్కొడాలి కామెంట్స్‌పై నిమ్మగడ్డ సీరియస్‌- రెచ్చగొట్టే వ్యాఖ్యలపై షోకాజ్‌ నోటీసు- వివరణకు డెడ్‌లైన్

వరుస ఎన్నికలకు జగన్ గ్రీన్ సిగ్నల్‌

వరుస ఎన్నికలకు జగన్ గ్రీన్ సిగ్నల్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు రెండో దశకు చేరుకుంది. శనివారం రెండో దశ పోలింగ్‌ జరగబోతోంది. ఈ నెల 21తో పంచాయతీ పోరు ముగియబోతోంది. ఆ వెంటనే మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు నిన్న సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ ద్వారా ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం.. ఇవాళ అదే విషయాన్ని రాతపూర్వకంగా అంగీకరిస్తూ ప్రతిపాదన పంపింది. దీనిపై ఎస్‌ఈసీకి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో త్వరలో రాష్టంలో వరుస ఎన్నికల జాతరకు రంగం సిద్దమవుతోంది.

 మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌

మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌


ఏపీలో ముందుగా మున్సిపల్‌ ఎన్నికల పోరుకు లైన్‌ క్లియర్ అయింది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్‌ ఎన్నికలను తిరిగి అక్కడి నుంచే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనకు ఎస్ఈసీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీ పోరు ముగియగానే ఈ నెల 23న వీటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సిద్ధమవుతున్నారు.
వచ్చే నెల మూడో వారంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్ఈసీ చర్యలు చేపడుతున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరుకు చిక్కులు

ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరుకు చిక్కులు


మున్సిపల్‌ ఎన్నికల పోరుకు ఎస్ఈసీ, ప్రభుత్వం ఇద్దరూ సుముఖంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరుకు మాత్రం పలు సమస్యలు ఉన్నాయి. వీటిలో ఏకాభిప్రాయాలే సమస్యగా మారాయి. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న విపక్షాలు వాటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళితే న్యాయ సమస్యలు తప్పకపోవచ్చని ఎస్‌ఈసీ అంచనా వేస్తున్నారు. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరుపై ఉత్కంఠ నెలకొంది.

న్యాయసలహా కోరిన నిమ్మగడ్డ

న్యాయసలహా కోరిన నిమ్మగడ్డ

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో వాయిదా పడిన చోటి నుంచే తిరిగి కొనసాగించాలా లేక కొత్తగా షెడ్యూల్ ఇవ్వాలా అన్న దానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరులో బలవంతపు ఏకగ్రీవాలపై అప్పట్లో నిమ్మగడ్డ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విపక్షాలు కూడా ఫిర్యాదు చేసాయి. ఇప్పుడు అదంతా వదిలేసి వాటిని కొనసాగిస్తే న్యాయపరంగా చిక్కుల ఎదురయ్యే అవకాశముంది. దీంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ దీనిపై న్యాయసలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం కోరుతున్న విధంగా ఒకే సమయంలో మున్సిపల్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరు కూడా నిర్వహించే విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నారు.

English summary
ysrcp government in andhra pradesh given its nod to hold local body elections in the state to state election commission. now sec seek legal opinion on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X