గవర్నర్ హరిచందన్ కు ఏపీ ఘన వీడ్కోలు- ఆకాశానికెత్తేసిన జగన్-మర్చిపోలేనన్న హరిచందన్
ఏపీ నుంచి బదిలీపై వెళ్తున్న గవర్నర్ హరిచందన్ కు ప్రభుత్వం ఇవాళ ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ హాజరై గవర్నర్ కు వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఉద్వేగ భరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అలాగే గవర్నర్, సీఎం జగన్ ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు.
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ ప్రజల తరపున ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకువచ్చారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.
రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉండాలో ఆచరణలో చూపించారన్నారు. గవర్నర్ వ్యవస్థకు ప్రభుత్వానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఇబ్బందులు చూస్తున్నామని, కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదన్నారు. గవర్నర్ స్వాతంత్ర సమరయోధులని, ఒరిస్సా ప్రభుత్వం లో మంత్రి గా బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారని జగన్ కొనియాడారు. ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో రికార్డ్ కూడా సృష్టించారన్నారు.గవర్నర్ సతీమణి సుప్రజా హరిచందన్ గవర్నర్ కు తోడుగా ఉన్నారని జగన్ తెలిపారు. విశ్వభూషన్ కు భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. మీ తీపి జ్ఞాపకాలు మాకు ఎప్పటికీ ఉంటాయని జగన్ తెలిపారు.

ఈ సందర్భంగా విశ్వభూషన్ హరిచందన్ కూడా అంతే ఉద్వేగానికి లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్ తనకు చాలా దగ్గరైన రాష్ట్రమన్నారు. ఉదయం కనకదుర్గ ఆశీస్సులు తీసుకున్నానని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనపై ఎంతో ప్రేమ అభిమానం చూపించారని గవర్నర్ తెలిపారు. సీఎం జగన్ తనపై చూపించిన ఆత్మీయత ఎప్పటికి మర్చిపోలేననన్నారు. ప్రజల సమస్యల పైనే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలు ఉంటాయన్నారు.
శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ గారికి అభినందనలు, ధన్యవాదాలు.. గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుదనాన్ని తీసుకొచ్చారు. ఒక తండ్రిలా, పెద్దలా వాత్సల్యం చూపారు. #CMYSJagan #APGovernor #BiswaBhushan pic.twitter.com/PavlyOkelV
— YSR Congress Party (@YSRCParty) February 21, 2023
ఏపీలో అనేక సంక్షేమ పధకాలు అమలు అవుతున్నాయని, రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమైన కార్యక్రమం అని గవర్నర్ తెలిపారు. తాను కూడా పలు ఆర్బీకేలకు వెళ్లానన్నారు.రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఆదర్శమన్నారు.
ప్రధాని కూడా రైతుభరోసా కేంద్రాలపై ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. మనం ఏ పదవి లో ఉన్న గవర్నర్ సీఎం లేక సోషల్ వర్కర్ ప్రజల కోసమే పని చేయాలన్నారు. ప్రజలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. న్యాయ, కార్య నిర్వాహక, శాసన వ్యవస్థలను గౌరవిస్తూ పనిచేయాలన్నారు. ఏపీ ప్రజల ప్రేమ ఆప్యాయతలను మర్చిపోలేనని గవర్నర్ తెలిపారు. తన ఆఖరి ఊపిరివరకు ఆంధ్రప్రదేశ్ ను మర్చిపోలేనన్నారు.












Click it and Unblock the Notifications