చంద్రబాబుకు వ్యక్తిగతంగా రూ.కోటిన్నర ఇచ్చిన ప్రభుత్వం?

మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భద్రత చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆయన భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ కృష్ణా బ్యారేజ్ నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే దారిలో కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు నివాసం ఉంది. గతంలో జరిగిన పరిణామాలు, వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు, ఉండవల్లిలోని ఇంటిపై జరిగిన దాడిని దృష్టిలో పెంచుకొని భద్రతను పెంచింది.

రూ.1.44 కోట్లు విడుదల చేస్తూ జీవో
భద్రత పెంపు కోసం రూ.1.44 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీచేసింది. వీటిల్లో రూ.81 లక్షలు ఖర్చుచేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు ఇంటి దగ్గరకు వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు, యూవీఎస్ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం రూ.42 లక్షలు ఖర్చు చేస్తారు. మిగిలిన డబ్బులతో ఇంటివద్ద సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఎన్ఎస్జీ కమాండోలు రక్షణ కల్పిస్తుండటంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కూడా భద్రతనిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జీకి బదులుగా సీఆర్పీఎఫ్ ను కేటాయించింది.

AP government has released 1 44 crore rupees to increase security near CM Chandrababu s house

సంచలనం సృష్టించిన దాడులు
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి, చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి సంఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ సంఘటనల్లో కీలక పాత్ర పోషించిన నిందితులను ప్రభుత్వం అరెస్ట్ చేసి వారినుంచి వివరాలు రాబడుతోంది. ఎవరి ప్రోద్బలంతో ఈ దాడులు జరిగాయి? ఎందుకు చేయాల్సి వచ్చింది? దాడులు చేయమని చెప్పింది ఎవరు? అంతమందిని ఎక్కడి నుంచి? ఎలా సేకరించారు? తదితర వివరాలను రాబడుతోంది. తాజాగా అరెస్ట్ చేసిన పానుగంటి చైతన్య మాత్రం సహకరించడంలేదని పోలీసులు చెప్పారు. ఫోన్ అడిగితే లేదని, మార్చేశానని, కోర్టు అడిగితే ఇస్తానంటున్నారని, సరైన రీతిలో విచారణకు సహకరించడంలేదని పోలీసులు నివేదిక అందజేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన కీలక నిందితులందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తోన్న ప్రభుత్వం సూత్రధారులను కూడా పట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+