Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ స్కూళ్లలో ఐబీ సిలబస్-చారిత్రక ఒప్పందం-జగన్ ఏమన్నారంటే?

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఎలాంటి లాభాపేక్షలేని ఐబీ వచ్చే ఏడాది నుంచి క్రమంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ఈ సిలబస్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది.

ఏపీ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై తాము నిబద్ధతతో పనిచేస్తామని, విద్యద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం అన్నది కూడా ఇదే ప్రథమం అన్నారు.

ap government historic mou with ib to implement international syllabus in schools

రాబోయే తరాలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తి కావాలన్నారు. తొలుత ప్లే బేస్డు లెర్నింగ్‌ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టిసారిస్తామని ఆయన తెలిపారు. దీనివల్ల కొత్త సామర్థ్యాలు వీరికి అలవడతాయన్నారు.

ap government historic mou with ib to implement international syllabus in schools

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ . ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం తమకు గొప్ప సంతృప్తి ఇస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం సంతృప్తినిచ్చే కార్యక్రమమన్నారు. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్‌ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా భారత్‌ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరమన్నారు.

ఇప్పుడున్న విద్యావిధానాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని, పాశ్చాత్య ప్రపంచంతో పోల్చిచూస్తే సాంకేతికత, పాఠ్యప్రణాళిక తదితర అంశాల్లో అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉందని జగన్ తెలిపారు. సమస్యా పూరణ సామర్ధ్యం, ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌ మోడల్‌లో ఎడ్యుకేషన్‌ నాలెడ్జ్‌ని వినియోగం వంటివి చాలా కీలకమన్నారు.. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ఐబీతో ప్రయాణంలో భాగంగా ముందు టీచర్లకు, సిబ్బందికి కెపాసిటీని పెంచేలా శిక్షణ కార్యక్రమాలు రానున్న విద్యాసంవత్సరంలో అమలవుతాయన్నారు. సంపన్నులకు మాత్రమే అందే ఐబీ విద్య అన్న పరిస్థితి ఇప్పుడు మారుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుందని, పదేళ్లలో 2035నాటికి పదోతరగతి, 2037 నాటికి పన్నెండు తరగతిలో ఐబీ బోధన మొదలవుతుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+