పేదలకు ఏపీ ప్రభుత్వం వరం.. ఇళ్ల స్థలాల పంపిణికి రంగం సిద్ధం.. ఏ రోజునంటే!
ఏపీలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ ప్రక్రియ ఇవాళ మొదలైంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎవరికి ఏ స్ధలం ఇవ్వాలో నిర్ణయించేందుకు అధికారులు ఇవాళ్టి నుంచి జిల్లాల్లో డ్రాలు నిర్వహిస్తారు. చివరిగా ఈనెల 25న ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాలను అందచేస్తారు.
ఏపీలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ
ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఇవాళ జీవో జారీ చేసింది. దీని ప్రకారం నేటి నుంచి పేదల ప్లాట్ల కేటాయింపుల ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. దీని ప్రకారం అధికారులు లబ్ధిదారుల ఎంపిక కోసం అన్ని జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు.

ఈ నెల 15 నుంచి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్
ఈనెల 15 నుంచి లబ్ధిదారుల పేర్ల మీద ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేపట్టనున్నారు. చివరిగా ఉగాదిరోజున అంటే ఈ నెల 25న ప్లాట్లను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
లబ్ధిదారులకు పూర్తిగా లే అవుట్ వేసిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications