పాత మద్యం బ్రాండ్లు, ధరల పై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఏపీలో పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ పైన కసరత్తు జరుగుతోంది. ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రయివేటు వ్యక్తులకు ఆక్షన్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. మద్యం దుకాణాల సంఖ్యకూడా పెరిగే అవకాశముంది. ధరలను తగ్గించేలా ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు.గతంలో ఉన్న బ్రాండ్లను ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న బ్రాండ్లను విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
కొత్త పాలసీ
ఏపీలో కొత్త మద్యం పాలసీ సిద్దం అవుతోంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పాలసీ తయారీ కోసం అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది ఏపీ సర్కార్. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఏ విధంగా ఉన్నాయి.. ఆ పాలసీ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి.. ప్రయోజనాలు ఏమిటి.. ఇలా అన్నింటిపైనా ఫోకస్ పెట్టింది. అలాగే మద్యం విషయంలో అక్రమాలకు తావులేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది.

పాత మద్యం బ్రాండ్లు
ఇప్పటి వరకూ గత ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణలను నిర్వహించేది. ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రయివేటు వ్యక్తులకు ఆక్షన్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. మద్యం దుకాణాల సంఖ్యకూడా పెరిగే అవకాశముంది. నాణ్యమైన బ్రాండ్లు... ఇక ఏపీ ప్రభుత్వం తెచ్చే నూతన ఎక్సైజ్ విధానంలో ధరలు కూడా తగ్గించాలని నిర్ణయించింది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకునేలా పాలసీని రూపొందిస్తుంది.
దుకాణాల నిర్వహణ
అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటుంది. బ్రాంది, విస్కీ, బీరుల్లో గతంలో ఉన్న బ్రాండ్లను ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న బ్రాండ్లను విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. తక్కువ ధరకు మద్యం అమ్మకాలు చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేలా కొత్త ఎక్సైజ్ పాలసీలో కసరత్తును ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది. గత అయిదేళ్ల కాలంలో అందుబాటులో లేకుండా పోయిన ప్రముఖ బ్రాండ్ల మద్యం ఏపీలో తిరిగి అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications