వరదల నేపథ్యంలో కలలో కూడా ఊహించని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ నగరం సగం మునిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తోడేస్తున్నారు. బాధితులకు ఆహార ప్యాకెట్లు, పాలప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలక చెందిన నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ తమకు తోచినంతలో ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్నారు.
కూరగాయలు కూడా తగ్గింపు ధరలోనే
ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలతో కూడిన కిట్ ను అందజేయాలని నిర్ణయించారు. ఈ కిట్ లో 25 కిలోల బియ్యం, ఒక లీటర్ పామోలివ్ నూనె, బంగాళాదుంపలు రెండు కిలోలు, ఉల్లిపాయలు రెండు కిలోలు, కందిపప్పు కిలో, పంచదార కిలో ఉంటుంది. వీటితోపాటు మొబైల్ మార్కెట్లద్వారా కూరగాయాలను అందజేస్తారు. వీటికి ధరలను కూడా నిర్ణయించారు. ఆకుకూరలు రూ.2, ఇతర కూరగాయలు రూ2, రూ.5, రూ.10 చొప్పున ఉంటాయి. రూ.20 పైన ఉండే కూరగాయలను పదిరూపాయలకే బాధితులకు అందజేస్తారు.

62 వైద్య శిబిరాలు ఏర్పాటు
ఇల్లు, దుకాణాలు నష్టపోయినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింప చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. అగ్నిమాపక యంత్రాలతో రోడ్లను, ఇళ్లను శుభ్రం చేయిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి పేరుకుపోయిన బురదను తొలగించడానికి కనీసం 20 నిముషాలు పడుతోంది. ఒక్కో అగ్నిమాపక యంత్రం ద్వారా ప్రతిరోజు 300 ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వీటిని తెప్పిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో 50 అగ్నిమాపక యంత్రాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. దాతలు నాణ్యమైన ఆహారాన్ని, పప్పులను ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు. నగరం మొత్తంమీద 182 ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. మొత్తం 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications