ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు - మార్గదర్శకాలు జారీ : కొత్త జిల్లాల్లో ఇలా..!!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియలో నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఉగాది నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కీలకమైన పరిపాలనా వ్యవస్థ పైన కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డర్ టు సెర్వ్ ప్రకారం ఆ జిల్లాల్లో వారి సేవలను వినియోగించుకోనుంది. మార్చి 11వ తేదీలోపు తాత్కాలిక కేటాయింపులు పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశించారు.

అపాయింటెడ్ డే నుంచి
కొత్త జిల్లాల అపాయింటెడ్ తేదీ నుంచి అధికారులు, ఉద్యోగులు కేటాయించిన చోటు నుంచి పని చేసేలా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తాత్కాలిక కేటాయింపులో జిల్లా, డివిజినల్ కార్యాలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర, రీజినల్/జోనల్, మండలం, గ్రామ స్థాయిలో పరిగణనలోకి తీసుకోకూడదని సూచించారు.
జిల్లా, డివిజినల్ స్థాయిలో తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను కేటాయింపులో వదిలేయాలి. ఆ కార్యాలయాలు ప్రస్తుతం కొనసాగే జిల్లాల పరిధిలోనే ఉండేలా చూడాలి. తుది కేటాయింపు పూర్తయ్యే వరకు తాత్కాలిక కేటాయింపు ప్రకారం పనిచేసే వారి సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసారు.

ఆర్డర్ టు సెర్వ్ కింద విధులు
తాత్కాలికంగా కేటాయించిన ఉద్యోగుల సేవలను కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో వినియోగించుకునేలా ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు ఇవ్వాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వీరి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లు పాత జిల్లాల్లో ఉన్నట్టుగానే కొనసాగుతాయి. తాత్కాలిక కేటాయింపులో భాగంగా జరిగిన సీనియారిటీ, పదోన్నతులు, సర్వీస్ అంశాలు, ఇతర సర్దుబాట్లన్నీ ప్రజా ప్రయోజనాల కోసం పరిపాలనా అవసరాల కోసం తాత్కాలికంగానే ఉంటాయి.
తాత్కాలిక కేటాయింపు లేని ఉద్యోగులు పాత జిల్లాల కార్యాలయాల్లోనే అపాయింటెడ్ డే నుంచి పని చేయాలి. ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ కోసం బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తారు. బదిలీల రవాణా అలవెన్సు వారి అర్హతలను బట్టి నిబంధనల ప్రకారం మంజూరు చేస్తారు.

జిల్లా స్థాయి యూనిట్ గా
రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా కొత్త జిల్లాల్లో తాత్కాలికంగా పని చేసేందుకు కేటాయిస్తారు. అన్ని శాఖలు జిల్లా స్థాయి పరిపాలనా యూని ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఒకే తరహా క్యాడర్ ఉన్న అధికారి పోస్టును సంబంధిత శాఖకు హెచ్‌ఓడీ కోసం ఉపయోగించుకోవాలి.
కొత్త జిల్లాల్లో హెచ్‌ఓడీ పోస్టుల్లో తాత్కాలిక నియామకాల కోసం సమాన స్థాయి అధికారులతోపాటు దానికి ఒక ర్యాంకు పైన, ఒక ర్యాంకు తక్కువ క్యాడర్ అధికారుల పూల్‌ను ఏర్పాటు చేసుకోవా లి. అందుబాటులోని రాష్ట్ర, జిల్లా, జోనల్ కార్యాలయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయాల మాదిరిగానే డివిజన్ కార్యాలయాలను అదే డివిజన్ స్థాయిలో తాత్కా లిక కేటాయింపులు చేసుకోవాలి.

తాత్కాలికంగా కేటాయింపులు
డివిజన్ పరిధి ఉన్న అన్ని డివిజన్ స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపులో చేర్చాలి. జిల్లా పరిధి ఉన్న అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించారు. ఆ శాఖల కార్యదర్శులు.. కార్యాలయాలు, ఉద్యోగులు, పోస్టుల తాత్కాలిక కేటాయింపులను స్క్రుటినీ చేసి ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపాలి.
అనుమతిచ్చిన తర్వాత తుది కేటా యింపు జాబితా తయారవుతుంది. ఆర్థిక శాఖ చివరగా ఉద్యోగుల సేవలను ఎక్కడ వినియోగించుకుంటారో తెలుపుతూ ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలను ఆయా శాఖలకు జారీ చేస్తుంది. ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు మార్చి 11వ తేదీకల్లా ఇచ్చేలా ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయాలని సీఎస్ అన్ని శాఖల హెచ్‌ఓడీలు, ఆర్థిక శాఖను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్ వెలువడే లోపు పూర్తి కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications