సీఎం జగన్ కీలక నిర్ణయం - మరో కొత్త పథకంతో ప్రజల్లోకి..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా మరో కొత్త పథకం ప్రకటించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలుకు నిర్ణయించారు. వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి...ఇప్పుడు ఈ పథకం అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

వైఎస్సార్ కళ్యాణమస్తు

వైఎస్సార్ కళ్యాణమస్తు

వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీలకు రూ. లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు లక్షా 20 వేలు, ఎస్టీల పెళ్లిళ్లకు లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే లక్షా 20 వేలు ఇవ్వనున్నారు. అలాగే బీసీ పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు అందజేయనున్నారు. ఇక మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష కానుకగా ఇవ్వనున్నారు. తాజాగా ప్రారంభం కానున్న కొత్త పథకాలతో మొత్తం 94.4 శాతం హామీలు నెరవేర్చామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది.

టీడీపీ హయాం కంటే రెట్టింపు

ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా అండ దక్కుతుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవోలో ఈ పథకం అమలుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. అందులో భాగంగా వికలాంగులకు రూ 1.50 లక్షలు.. భవన నిర్మాణ కార్మికులకు రూ 40 వేల చొప్పున ఇవ్వనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హాయంలో ఉన్న దాని కంటే మరింత లబ్ది కలిగేలా ఇచ్చే మొత్తాన్ని పెంచారు. దాదాపు రెండింతలు చేసారు. గతంలో ఎస్సీలకు రూ 40 వేలు ఉండగా.. ఇప్పుడు లక్షకు పెంచారు.

మేనిఫెస్టోలో 98.44 శాతం హామీల అమలు

మేనిఫెస్టోలో 98.44 శాతం హామీల అమలు

అదే విధంగా బీసీలకు రూ 35 వేలు టీడీపీ హాయంలో ఇవ్వగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ 75 వేలకు పెంచుతూ నిర్ణయించారు. మైనార్టీలకు రూ 50 వేలు ఇవ్వగా, జగన్ ప్రభుత్వంలో ఆ మొత్తం రూ లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసారు, భవన నిర్మాణ కార్మికులకు రూ 20 వేలు ఇవ్వగా.. ఇప్పుడు రూ 40 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసారు. అర్హులైన వారందరికీ కళ్యాణ మస్తు...తోఫా అమలయ్యేలా ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు దిశగా ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+