ఏపీలో గ్రామ సచివాలయాలపై మరో కీలక నిర్ణయం..?
ఏపీలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్ధలో కీలక మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే సచివాలయాల్లో సిబ్బందిని ప్రక్షాళన చేయడంతో పాటు ఎక్కువగా ఉన్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరికొన్ని మార్పులకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముందుగా గ్రామ సచివాలయాల పేరును మార్చబోతున్నట్లు సమాచారం.
గ్రామ సచివాలయాల పేరును ఇకపై గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పనున్నట్లు తెలుస్తోంది. గ్రామ సంక్షేమ కార్యాలయంలో డీడీఓగా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ద్వారానే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులగుర్తింపు, జాబితాను తయారు చేయాలని ఎటువంటి రాజకీయం ఒత్తిడి లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.

మరోవైపు గ్రామ పంచాయితీ కార్యాలయం, గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 30 లోపు చేసి అక్టోబర్ 2 నుండి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పని చేస్తున్న ఐదు మంది ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సిబ్బంది ప్రక్షాళన ఎలాగో ఉండబోతోంది.












Click it and Unblock the Notifications