ఏషియన్ పేయింట్స్‌తో ఎంవోయు: రెండున్నరేళ్ల టైమన్న బాబు
హైదరాబాద్: ఏషియన్ పేయింట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నాడు ఎంవోయు కుదుర్చుకుంది. ఏటా నాలుగు లక్షళ కిలో లీటర్ల సామర్థ్యంతో ఏషియన్ పేయింట్స్ రంగుల పరిశ్రమను విశాఖ జిల్లా పూడి వద్ద రూ.1750 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనుంది. ఈ పరిశ్రమ వల్ల దాదాపు 700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. 110 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ పరిశ్రమను నెలకొల్పుతారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మూడు వందల ఎకరాల్లో విశాఖలో సిగ్నేచర్ టవర్స్ నిర్మిస్తామని చెప్పారు. భారీ కన్వెన్షన్ సెంటర్లు, అమ్యూజింగ్ పార్కులు నెలకొల్పుతామన్నారు. ఏషియన్ పేయింట్స్ కంపెనీ నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని, వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు.

విశాఖ ఫెస్ట్ లోగో ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విశాఖ ఫెస్ట్ లోగో ఆవిష్కరంచారు. మండలి ఛైర్మన్ చక్రపాణి ఈ లోగోను ఆవిష్కరించారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న విశాఖ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కారు కసరత్తు ప్రారంభించింది. విశాఖ నగరం, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించే ఈ సంబరాల్లో భాగంగా ఈ ప్రాంత కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
విశాఖలో ఏయూ ఇంజినీరింగ్ మైదానంతో పాటుగా కళాభారతి ఆడిటోరియం, గాజువాక తదితర ప్రాంతాల్లోని పలువేదికల నుంచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వందకు పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రచురణల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అలనాటి తెలుగు చలనచిత్ర కళాఖండాలను కూడా ప్రదర్శిస్తారు.












Click it and Unblock the Notifications