కాటా ఆమ్రపాలి పోస్టింగ్ పై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు-ఏం జరుగుతోంది ?
తెలంగాణ నుంచి వచ్చిన ఐదుగురు ఐఏఎస్ అధికారుల్లో ఒకరికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మిగిలిన వారి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ ఐఏఎస్ లు కాటా ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, ప్రశాంతి ఏపీలో వచ్చి రిపోర్ట్ చేశారు. అయితే ఇందులో ప్రశాంతికి మాత్రమే అటవీశాఖలో పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన నలుగురు అధికారులకు మాత్రం ఇంకా పోస్టింగ్స్ దక్కలేదు.
తెలంగాణలో పనిచేస్తున్న వీరందరినీ గతంలో ఏపీకి వెళ్లిపోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. వీటిపై వీరంతా క్యాట్ నూ, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో అమరావతికి వచ్చి ఏపీ సీఎెస్ నీరభ్ కుమార్ ప్రసాద్ కు రిపోర్ట్ చేశారు. అనంతరం ప్రశాంతికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారికి త్వరలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కాటా ఆమ్రపాలితో పాటు రోనాల్డ్ రాస్ ను తిరిగి తెలంగాణకు పంపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో కీలక బాధ్యతల్లో ఉన్న కాటా ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ ను ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ కింద తిరిగి హైదరాబాద్ పంపే అవకాశాలున్నాయన్న ప్రచారం ఉంది. అయితే వీరి పోస్టింగ్స్ విషయంలో సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోకపోవడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వీరి విషయంలో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కుదిరితే డిప్యుటేషన్ లేకపోతే ఇక్కడే పోస్టింగ్ ఇస్తారని తెలుస్తోంది. అప్పుడు కాటా ఆమ్రపాలికి పవన్ పేషీలో ఇస్తారా లేక సీఎంవోలో ఇస్తారా లేక మరేదైనా ఇస్తారా తేలనుంది.












Click it and Unblock the Notifications