పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం షాక్.. ఫిబ్రవరిలో లక్ష మందికి కట్?
ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు షాక్ ఇస్తోంది. అధికారం లోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఆ ప్రకారమే పెన్షన్ పెంచినప్పటికీ.. లబ్ధిదారుల విషయంలో మాత్రం కోత పెడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో దాదాపు 26 రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు... ఇలా పలు కేటగిరీల్లో లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు.
రీసెంట్ గానే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగిస్తూ ఉతర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో కూడా పెన్షనర్లలో దాదాపు లక్ష మందికి పైగా కట్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్దిదారుల సంఖ్యను 63,59,907గా ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 3 వరకూ 62,43,436 మంది పెన్షన్ పొందినట్టు వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం ఇంకా దాదాపు 1,16,471 మందికి పెన్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది. గత మూడు రోజుల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. 98.17 శాతం మందికి పెన్షన్స్ ఇచ్చేశామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో మిగిలిన వారికీ ఇక పెన్షన్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని అంటున్నారు.
లబ్దిదారులు ఊళ్లో అందుబాటులో లేకపోవడం, అర్హత లేకపోవడం, చనిపోవడం వంటి పలు కారణాలతో లబ్ధిదారుల సంఖ్యా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జనవరిలో దాదాపు 92 వేల మందికి పెన్షన్ ఇవ్వలేదు. అలాగే మరో 18,036 మంది పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో 1,16,471 మందికి పెన్షన్ అందలేదు. మార్చిలో కూడా ఇలా కొనసాగితే మరో 2 లక్షల మంది పెన్షన్లను కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు కొత్తగా సీనియర్ సిటిజన్లు అయినవారు, కొత్తగా దివ్యాంగులు అయిన వారు.. చాలా మంది పెన్షన్ల కోసం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులను ఆహ్వానించట్లేదని ఫైర్ అవుతున్నారు. ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఏపీకి ఈ బెనిఫిట్.. ఫోకస్ చెయ్యమన్న సీఎం చంద్రబాబు -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications