ఏపీ ఆఫీసుల్లో మహిళలపై లైంగిక వేధింపులు-జగన్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై పెరుగుతున్న లైంగిక వేధింపులనివారణకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది.
అమరావతి : ఏపీలో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు అంతర్గతంగా ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీలు ఫిర్యాదుల స్వీకరణలో ప్రధాన భూమిక పోషిస్తాయని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోను, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు.
సచివాలయంలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో "పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013" అమలు తీరు పై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యత నిస్తూ సీఎం జగన్ పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా సాధికారతకు బడ్జెట్ లోనూ భారీ నిధులను కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు వెళుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంద్రప్రదేశ్ లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు.

అయితే పని చేసే ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేదింపులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు మహిళలు వారి సమస్యలను నిర్బయంగా చెప్పుకునేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉపయోగపడాలని మంత్రి కోరారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్దే ఇందుకు ప్రధాన కారణమన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు గత ఏడాది మార్చి 8న "సబల" కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
జరిగిందన్నారు. ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఇంకా కమిటీలు ఏర్పాటు చేయని కార్యాలయాల్లోని ఉద్యోగినులు వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్ దాకా రావాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ దాకా మహిళా ఉద్యోగినులు వచ్చే పరిస్థితి లేకుండా అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications