Gram Panchayats: పంచాయతీలకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్..! ఇక పండగే..!

ఏపీలో గ్రామ పంచాయతీ (gram panchayats)లకు, వాటిని నడుపుతున్న సర్పంచ్ లకు ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కొంతకాలంగా నిధులు లేక, చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు ఊరట కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలు చేసుకునేందుకు పంచాయతీలకు అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామ పంచాయతీలకు మేలు కలగనుంది.

గతేడాది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తవుతుందన్న కారణంతో సర్పంచ్ లను 15వ ఆర్ధిక సంఘం నిధులు వాడుకోకుండా ప్రభుత్వం బ్రేక్ వేసింది. అయితే జనవరి 5న ఈ నిధులు వాడుకునేందుకు వీలుగా పంచాయతీలు తీర్మానాలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో పంచాయతీల్లో ఈ మేరకు నిధుల వాడకానికి వీలుగా తీర్మానాలు చేసుకున్నారు. వీటి ప్రకారం ఇప్పుడు 15వ ఆర్ధిక సంఘం నిధులు వాడుకునేందుకు ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించింది.

AP Government Permits Gram Panchayats to Utilise 15th Finance Commission Funds

ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 5న చేసిన తీర్మానాల మేరకు ఆర్ధిక సంఘం ఇచ్చి నిధులు వాడుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. పంచాయతీల్లో పనులు చేసి, మెజర్‌మెంట్స్‌ పుస్తకాల్లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పంచాయతీల్లో పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు వేగవంతం కానున్నాయి. అలాగే ఇప్పటివరకూ పంచాయతీల నుంచి బిల్లులు రాక అల్లాడుతున్న కాంట్రాక్టర్లకు ఊరట కలగబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+