ఆ రైతు కుటుంబాలకు కూడా ఏపీ ప్రభుత్వం రుణమాఫీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇందుకోసం ఏపీ రైతు సాధికారిక సంస్థ విధివిధానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో దాదాపు 15వేల మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఉంటాయని భావిస్తున్నారు.
వీరికి కూడా రుణమాఫీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం జూన్ 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. స్థానిక బ్యాంకు, రైతు సాధికారక సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష నుండి లక్షన్నర రూపాల వరకు రుణమాఫీ చేయనున్నారు. వీరికి రుణమాఫీ ద్వారా ప్రభుత్వం పైన రూ.800 కోట్ల నుండి రూ.1000 కోట్ల వరకు భారం పడనుందని భావిస్తున్నారు. లబ్ధిదారులకు ఈ నెల 30వే తేదీలోగా డబ్బులు ఇవ్వనున్నారు.
చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపటి విశాఖ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి శనివారం అరకులో నిర్వహించనున్న జన్మభూమి - మావూరు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.












Click it and Unblock the Notifications