అమరావతి రైతులకు జగన్ సర్కార్ తీపికబురు- వరుసగా రెండో ఏడాది.....
ఓవైపు రాజధాని తరలింపు ప్రయత్నాలు, మరోవైపు కరోనా కష్టాలతో అల్లాడుతున్న అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఎట్టకేలకు కౌలు విడుదల చేసింది. వార్షిక కౌలు కింద రూ.190 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ పురపాలక శాఖ రెండు జీవోలు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రైతులకు కౌలు విడుదల చేయడం ఇది రెండోసారి.

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ఈ ఏఢాది తమకు కౌలు మొత్తం విడుదల ఆలస్యం కావడంతో హైకోర్టును ఆశ్రయించారు. తమకు కౌలు విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు. విపక్ష పార్టీలు కూడా కౌలు విడుదలకు సంబంధించి నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కౌలు విడుదల చేస్తూ పురపాలకశాఖ జారీ చేసిన ఉత్తర్వులు రైతులకు ఊరట నిచ్చాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోనే 900 మంది రైతులకు లబ్ది చేకూరనుంది.












Click it and Unblock the Notifications