ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఏపీ ప్రభుత్వం ఇవాళ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నిధులు బకాయిలు పెట్టడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులకు ఊరటనిచ్చేలా శుభవార్త అందించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి బకాయిల్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల బకాయిల కోసం విద్యార్ధుల్ని ఇబ్బందులు పెడుతున్న విద్యాసంస్థలకు వార్నింగ్ ఇచ్చింది.
ఏపీలో ఫీజు రియంబర్స్ మెంట్ పథకం అమలు కోసం రూ.600 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రియంబర్స్ మెంట్ కు 788 కోట్లు చెల్లించామని, త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.

దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యాసంస్థలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలోపు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దంటూ విద్యాసంస్థలకు స్పష్టం చేసింది. విద్యార్థులను ఇబ్బందిపెడితే కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్ధులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వంటి చర్యలకు విద్యాసంస్థలు పాల్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications