AP Pensions: ఏపీ పెన్షన్లలో షాకింగ్- ఆ కేటగిరీలో ఏకంగా 69 శాతం ఫేక్ ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు లబ్దిదారులకు అందించింది. అప్పట్లో రాజకీయ జోక్యం కారణంగా వివిధ కేటగిరీల పెన్షన్లలో భారీ ఎత్తున లబ్దిదారులు వచ్చి చేరారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిపై సర్వే నిర్వహిస్తోంది. ఇందులో ఓ కేటగిరీలో ఏకంగా 69 శాతం ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు తేలింది. అంటే ఆ కేటగిరీ కింద వారు పెన్షన్లు తీసుకునేందుకు అర్హులు కాదని తేల్చింది. దీంతో వీరిని త్వరలో తొలగించేందుకు సిద్దమవుతోంది.
రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్న కేటగిరీల్లో వృద్ధులతో పాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఇలా ఉన్నారు. వీరిలో దివ్యాంగుల పెన్షన్లు మాత్రమే రెండు కేటగిరీల్లో 24 వేలకు పైగా ఉన్నాయి. 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి దివ్యాంగుల పెన్షన్ కింద నెలకు 6 వేలు ఇస్తున్నారు. అలాగే వీరిలో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఉంటే వారికి 6 వేలకు బదులు నెలకు 15 వేలు ఇస్తున్నారు.

ఇందులో ప్రభుత్వం నిర్వహించిన తాజా సర్వేలో మొత్తం పెన్షన్లు అందుకుంటున్న 24 వేల 91 మంది దివ్యాంగుల్లో కేవలం 7539 మంది మాత్రమే పూర్తిగా అర్హులని తేలింది. మిగిలిన వారు అనర్హులని తేల్చారు. శాతంలో చూస్తే ఇది 69 శాతంగా ఉంది. అలాగే కేవలం 6 వేల పెన్షన్ కు మాత్రమే అర్హులై ఇలా 15 వేల పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య 9296గా ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే స్వల్ప వైకల్యం లేదా అసలు వైకల్యమే లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారు 7256గా తేల్చారు. దీంతో వీరికి షాకులు ఇచ్చేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
వాస్తవానికి దివ్యాంగులకు వైకల్య నిర్ధారణకు ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. వీటి జారీ లోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీని వల్లే ఇంత భారీ ఎత్తున అనర్హులు ఇలా పెన్షన్లు తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు తేల్చారు. ముఖ్యంగా డాక్టర్లు డబ్బులకు కక్కుర్తి పడి వీరికి ఇలా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు గుర్తించారు. దీంతో సదరు డాక్టర్లపైనా చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications