Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ప్రభుత్వ దసరా బహుమతి.. నిరుపేదల ఇంట సంతోషాల పంట!

ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు దసరా పండుగకు మరో శుభవార్తను అందిస్తోంది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. విజయదశమి నాటికి గృహప్రవేశాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

దసరాకు శుభవార్త చెప్పనున్న ఏపీ సర్కార్
దసరా పండుగకు ప్రజలకు శుభవార్త చెప్పబోతున్న ఏపీ ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ గృహ నిర్మాణాలను చేయాలని ప్రోత్సహించి, వాటిని త్వరితగతిన పూర్తిచేసి దసరాకు వారితో గృహప్రవేశాలు చేయించాలని నిర్ణయించింది. దీనికోసం గృహనిర్మాణ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

AP government to give Dussehra gift house warming ceremonies in the new houses of the poor

Take a Poll

దసరాకు కానుకగా మూడు లక్షల ఇళ్ళు
దసరా కానుకగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు చేయిస్తుంది. సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించేలా కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే మార్చికల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

ఏపీలో గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వ ఆర్ధిక సాయం
ప్రభుత్వం ఎస్సీ, బిసి వర్గాలకు 50వేల రూపాయలు, ఎస్టీ వర్గానికి 75వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించి, వీరి గృహ నిర్మాణాలకు బాసటగా నిలిచింది. ఈ మద్దతుతో అనేక మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లారు. ఈ గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది .దీని ద్వారా లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది.

ఆ ఇళ్ళు త్వరగా పూర్తయ్యేలా అధికారుల ప్రత్యేక శ్రద్ధ
ఈ సమయంలో కేంద్ర 60 శాతం వాటా భరిస్తే రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం వాటా ఇస్తుంది. ప్రస్తుతం రూఫ్ కాస్ట్, లెంటల్ లెవెల్, రూమ్ లెవెల్ దశల్లో ఉన్న ఇల్లు త్వరగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇళ్ల స్థలం లేని వారికి పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్ల భూమిని కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దసరా నాటికి పేదల ఇళ్ళ గృహప్రవేశాలు
గృహ నిర్మాణాలు జరుగుతున్న వారితో దసరా పండుగ నాటికి గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి దసరా పండుగ నాటికి ఎన్ని ఇళ్ళు పూర్తవుతాయి. ఎంతమందితో ప్రభుత్వం గృహ ప్రవేశాలు చేయించగలుగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పేదల జీవితాల్లో సంతోషం కోసం ఏపీ సర్కార్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+