వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 2న జగనన్న స్వచ్ఛ సంకల్పం-7న వైఎస్సార్ ఆసరా ప్రారంభం- మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పంపై జిల్లా కలెక్టర్లు, జెసి, డ్వామా పిడిలతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌, సెర్ప్ సిఇఓ ఇంతియాజ్, నరేగా డైరెక్టర్ చిన్నతాతయ్య తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్ 2న విజయవాడలో క్లాప్ -జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు వంద రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా పనిచేయాలన్నది సీఎం జగన్ ఆశయమని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని పెద్దిరెడ్డి కోరారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

 ap government to launch jagananna swacha sankalpam programme on oct 2, ysr asara on oct 7

గతంలో పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించిన పచ్చదనం-పరిశుభ్రతా పక్షోత్సవాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, గ్రామాల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుందామని పెద్దిరెడ్డి తెలిపారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. గ్రామాలకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం అందిస్తుందని,
ప్రజాభాగస్వామ్యంతోనే స్వచ్ఛసంకల్పం విజయవంతం అవుతుందని పెద్దిరెడ్డి వెల్లడించారు.

అక్టోబర్ 7వ తేదీన సీఎం జగన్ వైయస్‌ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. అర్హత ఉన్న ఎస్‌హెచ్‌జి మహిళల వ్యక్తిగత ఖాతాలకే ఆసరా సొమ్మును జమ చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పదిరోజుల పాటు ఆసరా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఆసరా అమలులో నియోజకవర్గ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మహిళలను ఆర్థిక స్వావలంభన దిశగా నడిపించాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. మార్కెటింగ్, రుణాల లభ్యత విషయంలో జిల్లా కలెక్టర్లు ఎస్‌హెచ్‌జి మహిళలకు మార్గదర్శనం చేయాలని సూచించారు.

English summary
ap panchayat raj minister peddireddy ramachandra reddy says cm ys jagan to launch jagananna swacha sankalpam on october 2 and ysr asara on october 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X