ఏపీలో రేపు కూడా రిజిస్ట్రేషన్లు..! వచ్చే వారం నుంచి వారికి ఫ్రీ..!
ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవు రోజులు రావడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయవు. కానీ రేపు ఒక్క రోజు మాత్రం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్లకు వసూలు చేసే అదనపు మొత్తాన్ని కూడా వసూలు చేయరాదని నిర్ణయం తీసుకుంది.
రేపు రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో హాలిడే మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు రెండవ శనివారం హాలిడేను తొలగించి యధా ప్రకారం రిజిస్ట్రేషన్ లో కొనసాగేవిధంగా ఉన్నతాధికారులు నిర్ణయించినట్లుగా తెలిపారు. వాస్తవానికి సెలవు రోజుల్లో ప్రత్యేకంగా 5000/-రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అమలల్లో ఉంది. కానీ రేపు రెండో శనివారం మాత్రం 5000/- రూపాయలను చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నత అధికారులు,సబ్ రిజిస్టార్లు తెలిపారు. మరోవైపు వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా తెలిపారు. అలాగే రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తామన్నారు. అయితే దయచేసి పేదలు తమకు ఇచ్చిన అమ్ముకోవద్దని లోకేష్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications