వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా కల్లోలం- జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ఇక ఇళ్లకే కిట్ల పంపిణీ...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా సహాయక చర్యల్లో మార్పులు చేస్తోంది. కరోనా సాధారణ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి హోం క్వారంటైన్ లోనే ఉండాలని సూచిస్తోంది. అదే సమయంలో వారికి ఇళ్ల వద్దే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా... వారికి కావాల్సినవాటిని వారి ఇంటికే పంపించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. కరోనా హోమ్ క్వారంటైన్ కిట్ ను పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఈ కిట్ ను అందిస్తారు..

ap government to send qurantine kits to covid 19 patients homes

లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తారు.

హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే... ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

English summary
andhra pradesh government has decided to send home quarantine kits to covid 19 patients home. govt will send these kits to patients with mild symptoms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X