కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో తాజాగా జిల్లాల విభజన, డివిజన్ల ఏర్పాటు, మార్పుచేర్పుల్ని పూర్తి చేసిన ప్రభుత్వం.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుుకుంది. సత్యసాయి జిల్లాలోని కదిరి, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత రెండేళ్లలో ఆయా ఆదాయం, వ్యయాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు కొత్త ఏడాదిలో మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం లభించింది.
రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీలు కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీలను అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం గ్రేడ్ 1లో ఉన్న తణుకును సెలక్షన్ గ్రేడ్ కు పెంచారు. అలాగే స్పెషల్ గ్రేడ్ లో ఉన్న కదిరి మున్సిపాలిటీ హోదాను సెలక్షన్ గ్రేడ్ హోదాకు పెంచారు. అలాగే గ్రేడ్ 3లో ఉన్న కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్ 1కు పెంచారు.

కదిరి మున్సిపాలిటీలో గత రెండేళ్ల ఆదాయ, వ్యయాల్ని పరిగణనలోకి తీసుకుని హోదా పెంచారు. అలాగే 2002 నుంచి ఆదాయ, వ్యయాల ఆధారంగా తణుకు మున్సిపాలిటీ హోదా పెంచారు. వీటితో పాటు 2021 నుంచి ఉన్న ఆదాయ, వ్యయాల ఆధారంగా కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్ పెంచారు. ఈ మున్సిపాలిటీల హోదాల పెంపు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications