వైన్స్ నిర్వాహకులకు ఏపీ సర్కార్ వార్నింగ్: లెక్క తేడా ఉంటే తీవ్ర పరిణామాలు

ఏపీలో మద్యం అక్రమ అమ్మకాలపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. అక్రమ అమ్మకాలకు పాల్పడితే చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికే ఏపీలో లాక్ డౌన్ సందర్భంగా మద్యం షాపులు కూడా బంద్ అయ్యాయి. అయినా సరే మద్యం ప్రియులకు బ్లాక్ మార్కెట్ లో మద్యం దొరుకుతుంది. విపరీతంగా ధరలు పెంచి గతంలో ఉన్న ధరల కంటే నాలుగు రెట్లు ధరలు పెంచి ప్రజలను యధేచ్చగా దోచుకుంటున్నారు.

ఈ క్రమంలో మద్యం అక్రమ అమ్మకాలు జరగకుండా తనిఖీలు చేస్తూ కమిటీలను వేసింది ఏపీలోని వైసీపీ ప్రభుత్వం. లాక్ డౌన్ సందర్బంగా మద్యం అమ్మకాలు పై దృష్టి సారించిన ఏపీ సర్కార్ రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు,బార్ అండ్ రెస్టాంట్ లలో తనఖీలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది . తనఖీల కోసం ప్రత్యేకంగా ఎక్సైజ్ అధికారులు, స్దానిక పోలీసులు, మరియు రెవెన్యూ అధికారులతో కమిటిలు నియమించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇదే విషయాన్ని మద్య విమోచన కమిటి ఛైర్మన్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు .

 AP government Warning to the Wine shops owners

ఇక తాజాగా ఏపీలో బ్లాక్ మార్కెట్ లో మద్యం దందా జోరుగా జరుగుతుందన్న వార్తల నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ లెక్కలు తేడా వస్తే అంతే సంగతి అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే నరసరావుపేట,చిలకలూరిపేట మద్యం దుకాణాల్లో వెలుగు చూసిన అక్రమాల పై చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.

మార్చి 22వ తేదీన ఉన్న లెక్కలకు తనఖీలు సందర్బంగా చేసిన లెక్కలకు వ్యత్యాసం ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక ప్రజా ప్రతినిధులు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తే వారిని సైతం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇక వారి జాబితాను ముఖ్యమంత్రి దృష్టిలో పెడతామని వారి పై కూడ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+