Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lata Mangeshkar: గవర్నర్ బిశ్వభూషణ్, వైఎస్ జగన్ సంతాపం

ముంబై: ప్రఖ్యాత గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. నెల రోజుల పాటు ఆమె అనారోగ్యంతో బాధపడ్డారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా వైరస్ బారిన పడటంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచారు డాక్టర్లు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈ ఉదయం 8:12 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం శివాజీ పార్కునకు తరలించనున్నారు. లతా మంగేష్కర్‌కు తొలుత కరోనా వైరస్ సోకింది. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. జ్వరం తీవ్రమైంది. దీనితో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు.

 AP governor Biswabhusan and CM YS Jagan expresses grief at the demise of Lata Mangeshkar

కరోనా వైరస్ నెగెటివ్‌ రిపోర్ట్ వచ్చినప్పటికీ- తీవ్ర అనారోగ్యం వేధించింది. పలు అవయవాలు దెబ్బతిన్నాయి. దీనితో రెండు రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం మళ్లీ దిగజారింది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనితో ఆమెను డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ విషయం తెలుసుకుని ఆమె చెల్లెలు, ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే శనివారం రాత్రే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పలు అవయవాలు దెబ్బతినడం వల్ల లతా మంగేష్కర్ కన్నుమూశారని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు.

లతా మంగేష్కర్ మరణానికి సూచకంగా కేంద్ర ప్రభుత్వం రెండు రోజులను సంతాప దినాలుగా ప్రకటించింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా, మెలోడీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు. దాదాపు అన్ని భాషల్లోనూ వేలకొద్దీ పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, గుజరాతీ, మరాఠీ.. ఇలా అన్ని భాషల చలనచిత్ర పరిశ్రమకు సేవలను అందించారు. 50 వేలకు పైగా పాటలు పాడారు.

లతా మంగేష్కర్ మరణం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేమని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వీన్ ఆఫ్ మెలోడీ, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ లేని లోటును ఏ మాత్రం పూడ్చలేమని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. లతా మంగేష్కర్ ఇక లేరనే విషయం తనను కలచి వేసిందని చెప్పారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

లతా మంగేష్కర్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భౌతికంగా తమతో లేకపోయినప్పటికీ.. ఆమె పాడిన పాటలు, సంగీత ప్రపంచానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు. ప్రతి రోజు ఆమె గుర్తుకు వస్తుంటారని చెప్పారు. సంగీతం ఉన్నన్ని రోజులూ లతా మంగేష్కర్ జీవించి ఉటారని చెప్పారు. లతాజీ అందించిన మెలోడీలకు మరణం లేదని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+