హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AP Governor బిశ్వభూషణ్‌కు తీవ్ర అస్వస్థత: హైదరాబాద్‌లో చికిత్స

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఎఐసీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థిితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. బిశ్వభూషణ్ హరిచందన్ వయస్సు 87 సంవత్సరాలు. ఒడిశాకు చెందన భారతీయ జనతా పార్టీ నాయకుడాయన.

భార్య సుప్రవ హరిచందన్, కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ ఉన్నారు. ఈ తెల్లవారు జామున అనారోగ్యానికి గురయ్యారు. దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన వెంట భార్య సుప్రవ హరిచందన్ ఉన్నారని తెలుస్తోంది. డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేస్తారని సమాచారం.

 AP Governor Biswabhushan Harichandan health critical, airlifted to hyderabad

వృత్తిరీత్యా హరిచందన్ న్యాయవాది. జనతాదళ్‌లో చేరడంతో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. 1996లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ-బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. కీలకమైన రెవెన్యూ, న్యాయ, మత్స్యాభివృద్ధి శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనను ఏపీకి గవర్నర్‌గా పంపించింది.

English summary
AP Governor Biswabhushan Harichandan health critical, airlifted to hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X