AP Govt: పంట నష్టపోయిన రైతులకు ఏపీ సర్కార్ పరిహారం- ఏయే పంటకు ఎలా?

ఏపీపై పంజా విసిరిన అర్నాబ్ తుఫాన్ తీరం దాటిపోయింది. అయినా ఇంకా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వీటిని కాపాడేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ నేపథ్యంలో పంటలకు నష్టపరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం (ap govt) ఇవాళ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏయే పంటకు ఎంత మేర రైతులకు పరిహారం లభిస్తుందో వివరాలను అధికారులు ప్రకటించారు.

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖ ఇదే- బయటపెట్టిన వైసీపీ..!
వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖ ఇదే- బయటపెట్టిన వైసీపీ..!

వీటి ప్రకారం అర్నాబ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందనుంది. అలాగే
వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం అందించనున్నారు. చెరుకు పంటకు ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వనున్నారు.
సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడుకు ఎకరాకు రూ.15వేల సాయం అందిస్తారు.
అరటి, పసుపు, మామిడి, జీడిమామిడితో పాటు, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్‌కు ఎకరాకు రూ.35 వేల పరిహారం లభించనుంది. ఇక కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌కు రూ.25 వేలు పరిహారం అందిస్తారు. తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం అందిస్తారు. అలాగే కొబ్బరి, ఆయిల్ పామ్‌ ఒక్కో చెట్టుకు రూ.15 వేలు పరిహారం ఇస్తారు.

AP Govt Announces Crop Loss Compensation for Farmers Hit by Cyclone Arnab
అర్ణబ్ తుఫాన్ పై రైతులకు ఏపీ సర్కార్ కీలక సూచనలు..! ఇలా చేస్తే సేఫ్..!
అర్ణబ్ తుఫాన్ పై రైతులకు ఏపీ సర్కార్ కీలక సూచనలు..! ఇలా చేస్తే సేఫ్..!

ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై త్వరలోనే అధికారులు క్షేత్రస్దాయిలో పర్యటించి వివరాలు సేకరించబోతున్నారు. అనంతరం కేంద్రానికి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడటంతో పాటు ఓ లేఖ కూడా రాశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ఆయన అమిత్ షాను కోరారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కు తక్షణ పరిహారంగా కొంత మొత్తం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నిధులు రాగానే తుఫాన్ సహాయక చర్యల వేగవంతంతో పాటు రైతులకు పరిహారం కూడా చెల్లించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+