కరోనా లాక్ డౌన్ : ఏపీలో రవాణా శాఖ కొత్త యాక్షన్ ప్లాన్ ...
ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చారు. వీటి ప్రకారం రో్డ్లపై అత్యవసర సర్వీసులతో పాటు గూడ్స్ వాహనాలను అనుమతిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని మార్పులు చేసిన రవాణాశాఖ కొత్త యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది. దీన్ని అమలు చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తోంది.
రవాణాశాఖ యాక్షన్ ప్లాన్ ఇదే..
కేవలం నిత్యావసర, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని రవాణాశాఖ నిర్ణయించింది. అనుమతి తీసుకున్న అత్యవసర కారుకు సైతం డ్రైవర్ తో పాటు ఒకరు మాత్రమే వెళ్ళే అవకాశం కల్పించనున్నారు. ఆ ఒక్కరు కూడా వెనుక సీటులోనే ప్రయాణం చేయాలని నిబంధన విధించారు.

బైక్ పై ఒకరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అన్ని గూడ్స్ వాహనాలకు అనుమతి కొనసాగనుంది. ఖాళీ గూడ్స్ వాహనాలకు కూడా ఇది వర్తిస్తుంది. గూడ్స్ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తితే రాష్ట్ర కంట్రోల్ రూమ్ ని సంప్రదించాలని రవాణాశాఖ కోరింది.
.
అధికారులకూ..
రవాణా అధికారులకు టాస్క్..
లాక్ డౌన్ నిబంధనల అమలు కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక టీం లు ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. నిబంధనలను అతక్రమించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశాలు వెళ్లాయి. లారీ ఓనర్స్ తో సమావేశం అయ్యి వారికి అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధకారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. జాతీయ రహదారులపై ట్రక్ రిపేర్ షాపులు, డాబాలు, లేబర్ ట్రాన్స్పోర్ట్ లాంటి ఏర్పాట్ల కోసం జిల్లా యంత్రాంగం తో సమన్వయం చేసుకోవాలని రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.
ప్రతి వాహనాన్ని ఒక శాతం హైపో క్లోరైడ్ సొల్యూషన్ తో శానిటైజ్ చేయాలని ఆదేశించారు. ప్రతి వాహనానికి డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ అందిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.