రామోజీ మృతితో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
ఈనాడు సంస్థల అధినేత రామోజీకి చంద్రబాబు నివాళి అర్పించారు. రామోజీ సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగారని కీర్తించారు. రామోజీ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. రామోజీరావు మరణం చాలా బాధాకరమని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో రామోజీ మరణం తో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మీడియా మోగల్ రామోజీరావు కు ఎపి ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించరు. ఈ మేరకు ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వలు విడుదల చేశారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లి కుటుంబ సభ్యులతో నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.

సినీ ఇండస్ట్రీకి రామోజీరావు ఎనలేని కృషి చేశారని, ధర్మం కోసమే పని చేస్తానని చాలా సందర్భాల్లో తనకు చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉండిపోతాయని తెలిపారు. ఎన్నో ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించారని చంద్రబాబు చెప్పారు. తన జీవితకాలంలో రామోజీరావు విశ్వసనీయత సంపాదించుకున్నారని, తెలుగు జాతికి ముందుకు తీసుకెళ్లేందుకు చాలా కృషి చేశారని తెలిపారు. ఏపీ అభివృద్ధి విషయంలో రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్తామని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications