అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం - తాజా నిర్ణయంతో..!!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఇటు టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. మార్చి 15 నుంచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో గతంలో స్థలాలు కేటాయించిన కేంద్ర సంస్థలకు వాటిని రెన్యువల్ చేస్తున్నారు. ఇక.. రాజధానికి కీలకంగా భావిస్తున్న ఓఆర్ఆర్ నిర్మాణం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయం
అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో ప్రభుత్వం భూ సేకరణకు సిద్దమైంది. ఇందు కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. అమరావతి నుంచి ఓఆర్ఆర్ వెళ్లే అయిదు జిల్లాల్లో భూసేకరణ కు సంబంధించి ప్రభుత్వం వీరికి బాధ్యతలు అప్పగించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది.ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్​ఆర్ వెళుతోంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లుగా అధికారులు ఖరారు చేసారు.

AP Govt appoints special for ORR land Acquisition in Amaravati Area details here

మూడు ఎలైన్ మెంట్లు
ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఇటీవల 189.9 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌కు ఆమోదం తెలిపింది. కాగా, విజయవాడ తూర్పు బైపాస్‌ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్‌ రోడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో విజ యవాడ బైపాస్‌ మొదలయ్యే కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీట ర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ ఈ ప్రతిపాదనలో భాగంగా మూడుఎలైన్‌మెంట్లను ప్రభుత్వానికి సమర్పించింది.

ప్రత్యేక అధికారులు
ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక, వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు. అక్కడ ఆమోదం రాగానే ఓఆర్‌ఆర్‌ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్‌ జారీచేస్తారు. అభ్యంతరాలన్నీ పరిష్కా రమయ్యాక 3డీ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం అధీనంలోకి వెళ్లినట్లు గుర్తిస్తారు. పరిహారం చెల్లింపు..భూముల బదలాయింపు తరువాత పూర్తి స్థాయిలో ఈ భూములు ఓఆర్ఆర్ నిర్మాణం కోసి వినియోగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+