అమరావతిపై ఇదీ మా ప్రణాళిక- హైకోర్టుకు ప్రభుత్వం క్లారిటీ : 60 నెలలు కావాలి..!!

అమరావతి గురించి ప్రభుత్వం తమ ప్రణాళిక ఏంటో క్లారిటీ ఇఛ్చింది. అమరావతి నిర్మాణాల పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేసింది. కోర్టు తీర్పు సమయంలోనే నెల రోజుల్లోగా ప్రభుత్వ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో..న్యాయస్థానం సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. సుదీర్ఘంగా తయారు చేసిన ఈ అఫిడవిట్ లో కోర్టు తీర్పు..ప్రభుత్వ ప్రణాళికలను వివరించినట్లు సమాచారం.

60 నెలల సమయం అవసరం

60 నెలల సమయం అవసరం

190 పేజీలతో దాఖలు చేసిన ఈ అఫిడవిట్ లో ప్రభుత్వం కోర్టు సూచించిన విధంగా మూడు నెలలు - ఆరు నెలల్లో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయలనే ఆదేశాలన 60 నెలలను పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. సీఆర్​డీఏ చట్టంలో పనుల పూర్తికి.. మరో ఐదేళ్లు పొడిగించాలని ప్రభుత్వం తన అఫిడవిట్ లో కోర్టును అభ్యర్ధించింది. కోర్టు చెప్పిన విధంగా మొత్తం మౌళిక సదుపాయాల కల్పన..వాటిని పూర్తి చేసేందుకు ఆరు నెలల సమయం కాదని..60 నెలలు కావాలని అఫిడవిట్ లో పేర్కొంది. అమరావతి పరిధి నుంచి వెళ్లిపోయిన యంత్రాంగం .. వర్కర్లను తిరిగి రప్పించి పనులు ప్రారంభించేందుకు రెండు నెలల సమయం అవసరమం అవుతుందని అందులో వివరించారు.

బ్యాంకర్లు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు

బ్యాంకర్లు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు


తిరిగి పనులు ప్రారంభించేందుకు ఎనిమిది నెలలు అవసరమని సీఎస్ పేర్కొన్నారు. ఇక, కీలకమైన రహదారులు నిర్మాణ చేయటానికి 16 నెలల వరకు సమయం కావాలని కోర్టును కోరారు. రహదారులు పూర్తి చేసిన తరువాత మౌళిక వసతుల కల్పనలో భాగంగా డ్రైనేజీ.. వాటర్ వర్క్స్..వంటి ఇతర పనులకు మరో 36 నెలల సమయం పడుతుందని వివరించారు. హైకోర్టు ఉత్తర్వుల్లో సూచించిన గడువులోగా రాజధాని నిర్మాణం సీఆర్డీఏకి, ప్రభుత్వానికి సాధ్యం కాదని అఫిడవిట్ లో స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం 42 వేల 231 వేల కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించారని పేర్కొన్నారు.

గడువు పెంచండి.. అయిదేళ్లు కావాలి

గడువు పెంచండి.. అయిదేళ్లు కావాలి


నిధుల సమీకరణకోసం గత నెల 23వ తేదీన బ్యాంకర్లతో సీఆర్ఢీఏ అధికారులు సమావేశం నిర్వహించిన విషయాన్ని కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో వివరించారు. రాజధానికి నిధుల విషయం పైన బ్యాంకుల నుంచి ఇంకా స్పందన రాలేదని పేర్కొన్నారు. ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకే కనీసం 5 ఏళ్ల గడువు అవసరమని సీఎస్‌ తమ అఫిడవిట్ లో సవివరంగా చెప్పుకొచ్చారు. దీంతో.. న్యాయస్థానం ఇచ్చిన నిర్దేశిత సమయం గడవును సవరించాలని..లేదా తీసేయాలని ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా హైకోర్టును అభ్యర్దించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+