అమరావతి రైతుల ఆందోళన వేళ ప్రభుత్వం కీలక హామీ, డెడ్ లైన్- ఇక నుంచి..!!

అమరావతి రైతులకు ప్రభుత్వం కీలక హామీ వచ్చింది. వారి ఆందోళనలను తెలిగించే ప్రయత్నం చేసింది. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టత ఇచ్చింది. భూ సమీకరణ సమయంలో ఒప్పందం మేరకు చెప్పిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని వెల్లడించింది. రైతులు ప్రస్తావించిన అంశాలు అనేక కారణాలతో పెండింగ్ లో ఉన్నాయని.. అన్నింటినీ పరిష్కరించి రైతులకు మేలు జరిగేలా కార్యాచరణ ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందు కోసం కార్యాచరణ ఖరారు చేసారు.

రాజధాని రైతుల సమస్యలపై చర్చించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని సీఎం చంద్రబాబు నియమించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో జరిగిన సమవేశంలో రైతుల సమస్యలపై చర్చించారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని పెమ్మసారి గుర్తు చేసారు. ఇంత మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత వేగంగా అన్నీ జరగవని చెప్పుకొచ్చారు. 700 ఎకరాల భూమిలో రైతులకు సమస్యలు ఉన్నాయని.. వీటిలో వివిధ కారణాలతో సమస్యలు వచ్చాయని తెలిపారు. సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని భేటీలో చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా జరిబు ల్యాండ్ సమస్యల విషయంలో నిజమైన జరిబు రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. దీనిలో కూడా 180 ఎకరాల్లో మాత్రమే సమస్య వచ్చిందని.. 30 రోజుల్లో నిజనిర్ధారణ చేసి పరిష్కారం చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.

ap-govt-assured-amaravati-farmers-to-full-fill-the-all-promises-in-the-capital-area

కాగా, గ్రామకంఠాల విషయంలో గైడ్ లైన్స్ పాటించకుండా చేసినందు వల్ల 36 ఎకరాల్లో సమస్ యలు వచ్చాయని కేంద్రమంత్రి వివరించారు. గ్రామ కంఠాలలో ఎవ్వరికైనా ఎక్కువ ఇచ్చినట్టు గుర్తిస్తే వాటిపై రీ సర్వే చేస్తామన్నారు. 30 రోజుల్లో అడిషనల్ కమిషనర్ రిపోర్ట్ తీసుకొని పరిష్కరి స్తామన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో, జగన్ వచ్చాక లంక భూముల విషయంలో కోర్టు చిక్కు లు ఏర్పడ్డాయని అన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో అమ్ముకునే అవకాశం ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం కుదరదని చెప్పడంతో ఇబ్బందులు వచ్చాయన్నారు. 90 శాతం మందికిపైగా రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేసినట్లు తెలిపారు. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాల కు డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు. 2026 జూన్ నాటికి గ్రామాల్లో మౌలికవసతులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. లే ఔట్‌లు ఇచ్చిన చోట సరిహద్దు రాళ్ళుపోయాయన్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి సరిహద్దు రాళ్ళ సమస్య పరిష్కరిస్తామన్నారు.

రైతులు అపోహలు నమ్మొద్దని .. రెండు వారాలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. సమస్యలన్నింటినీ ఆరు నెలలలోగా పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై సమావేశంలో చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. ఖచ్చితంగా ఆరు నెలల్లో రైతుల సమస్యలకు పరిష్కారం వస్తుందన్నారు. కోర్ట్ కేసులు.. ఇతర కారణాల వల్ల ఆలస్యం అయిందని చెప్పారు. ఒకరిద్దరు వాళ్ల స్వార్ధం కోసం చెప్పే అంశాలను నమ్మవద్దని మంత్రి అన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న లే ఔట్లలో సరిహద్దు రాళ్లు వేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రెండు వైపుల మాత్రమే సర్వే రాళ్లు వేయగలిగామన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సెట్ అయ్యాక మిగిలిన రెండు వైపులా సర్వే రాళ్లు వేస్తామని చెప్పారు. త్వరలో డీపీఆర్ రెడీ చేస్తామని.. డీపీఆర్ తయారు చేశాక గ్రామ సభలు పెట్టి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+