ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక, ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే జాయింట్ కౌన్సిల్ భేటీలో పలు అంశాల పైన చర్చించింది. ఉద్యోగులతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయిన సమయంలో రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని వివరించారు. ఉద్యోగులకు ఒక పెండింగ్ డీఏ విడుదల చేసారు. కాగా, గతంలో ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతి వేళ ప్రతీ ఉద్యోగికి మేలు జరిగేలా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి వేళ ఉద్యోగులకు బిగ్ న్యూస్ చెప్పింది. ప్రతీ ఉద్యోగికి మేలు కలిగేలా తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైమ్ షెడ్యూల్ నిర్ణయించింది. ఈ మేరకు రానున్న 20 రోజుల సమయంలో ప్రతీ ఉద్యోగికి పదోన్నతి కల్పించేలా విధి విధానాలు ఖరారు చేసారు. అదే సమయంలో ఇక నుంచి ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ కచ్చితంగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) విజయానంద్ స్పెషల్ సీఎస్ లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు అత్యవసర మెమో జారీ చేశారు. శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల 31 నాటికి డీపీసీలు పూర్తి చేసి, పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.

తాజా నిర్ణయం మేరకు ఈ నెల 21 నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్‌వోడీలు సచివాలయానికి పంపాలని సూచించారు. 23 నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలన విభాగానికి పంపించాల్సిందిగా నిర్దేశించారు. ఇక.. ఈ నెల 29 నాటికి సాధారణ పరిపాలన శాఖ డీపీసీ పూర్తి చేసి, సంబంధిత మినిట్స్‌ను ఆయా సెక్రటరీలకు పంపించేలా షెడ్యూల్ ఖరారు చేసారు. చివరగా.. ఈ నెల 31న సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో స్పష్టం చేసారు. ఇందు కోసం జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజా ఆదేశాల్లో స్పష్టం చేసారు. ఈ నిర్ణయం ద్వారా ప్రతీ ఉద్యోగికి తన జాబ్ సమయం లో పురోగతితో పాటుగా పదోన్నతి దక్కనుంది. ఇక.. పెండింగ్ డీఏలు.. పీఆర్సీ తో పాటుగా బకాయిల చెల్లింపు విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications