రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ ఆఫర్ - ఇక ప్రతీ కుటుంబానికీ..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దారులకు నిత్యావసరాల పంపిణీ విషయంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ తో పాటుగా నిత్యావసర దుకణాల వద్దే వీటిని సరఫరా చేస్తున్నారు. అదే విధంగా రేషన్ షాపు వద్దకు రాలేని వారి కోసం ప్రత్యేకంగా ఇంటి వద్ద డెలివరీ ఇస్తున్నారు. ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖ తాజాగా మరో నిర్ణయం అమలుకు సిద్దమైంది. దీంతో.. రేషన్ కార్డు దారులకు ప్రయోజనం కలగనుంది.

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు మరో శుభవార్త అందించింది. తెల్లకార్డు కలిగి ఉన్నవారికి గోధుమ పిండిని పంపిణీ చేయనుంది. జనవరి 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో ప్రారంభం కాలేదు. ఈ నెల నుంచి మిగిలిన మున్సిపాలిటీల్లోనూ అమలు దిశగా సరుకు సిద్దం చేసింది. బహిరంగ మార్కెట్ లో గోధుమ పిండి కొనాలంటే బ్రాండ్‌ను బట్టి కేజీ రూ.70 వరకు ఉంటుంది. అయితే తెల్లకార్డు ఉన్నవారికి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా కిలో రూ.20కే అందించనుంది. అదే విధంగా ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు జొన్నలు, రాగుల పంపిణీ చేపడుతున్నారు. ఒక్కో కార్డుపై బియ్యానికి బదులు 3 కిలోల వరకు జొన్నలు ఇస్తున్నారు. అంటే మూడు కిలోల జొన్నలు తీసుకుంటే బియ్యంలో 3 కిలోలు తగ్గిస్తున్నారు. ఇక రాగులు కూడా ఇదే తరహాలో పంపిణీ చేస్తున్నారు. అయితే కందిపప్పును కూడా కొన్ని నెలల పాటు ప్రభుత్వం పంపిణీ చేసింది.

ap-govt-big-decision-over-increase-essential-commodities-in-ration-supply-here-the-details

ప్రభుత్వం కొత్త మార్పుల దిశగా కసరత్తు

కాగా.. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ లో కిలో కందిపప్పు రూ.100కిపైగా పలుకుతుంది. కాగా, రేషన్ షాపుల ద్వారా కిలో రూ.67కే ప్రభుత్వం కార్డుదారులకు అందిస్తోంది. అయితే ప్రభుత్వం దగ్గర కందిపప్పు నిల్వలు లేకపోవడం, సరఫరా తగ్గటంతో కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. దీంతో కందిపప్పు కోసం లబ్దిదారులు కందిపప్పు కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల కూడా కందిపప్పు పంపిణీ జరగడం లేదని సమాచారం. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో సరుకులను అందిస్తున్నారు. 65 ఏళ్లు పైడినవారికి రేషన్ డీలర్లు ఇంటి వద్దకే తీసుకెళ్లి అందిస్తున్నారు. ఇప్పటికే అర్హులైన వారికి కొత్త స్మార్ట్ కార్డులకు ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. కాగా, త్వరలోనే రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్ కింద మార్చే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేసి.. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వీటిని విస్తరించేలా ఆలోచన చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+