ఆ భూములు..ఇళ్లు మీవే, ప్రభుత్వం బంపరాఫర్ - ఇలా చేయండి..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక సారి ఇచ్చిన అవకాశం మరి కొంత కాలం పొడిగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగియటంతో.. ఇప్పుడు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ స్కీమ్‌ను మరోసారి అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
స్థలాల క్రమబద్దీకరణ కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది పాటు అవకాశం కల్పించింది. అయితే, అనేక మంది ఆ సమయంలో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారు. స్కీమ్‌పై సరైన అవగాహన లేకపోవడం, ఇంకా ఇతర భయాలతో దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఏడాది మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించాలని పార్టీ నేతల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం మరోసారి నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అంటే, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు, ఇంకా పూరిపాకలు, తాత్కాలిక షెడ్‌లు వేసుకుని నివసిస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చెరువులు, కుంటలు, కాలువ, చెరువు పోరంబోకు, డిఫెన్స్, ఇతర కీలకమైన ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన భూముల్లో క్రమబద్ధీకరణకు అవకాశం ఉండదు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని పక్షంలోనే క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు.
మార్గదర్శకాలు జారీ
అందులో భాగంగా ఈ మేరకు అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఈ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ఆదేశించింది. తాజాగా భూముల క్రమబద్ధీకరణలో విశాఖ జిల్లా గాజువాకకు మరో స్కీమ్‌ను ప్రభుత్వం పునరుద్ధరించింది. గాజువాక గ్రామ పరిధిలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇంటి నిర్మాణం చేసుకుంటే వెయ్యి చదరపు గజాల వర కు క్రమబద్ధీకరణకు అనుమతించాలని నిర్ణయించారు.
క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఈ ఏడాది జూన్ 30 వరకు స్వీకరించాలని తాజా గడువును నిర్దేశించింది. జీవో నం. 45 ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు పేదలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ పథకం గురించి అవగాహన పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
-
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications