'తల్లికి వందనం' అమల్లో బిగ్ అప్డేట్ - రైతులకు రూ 20 వేలు..!!
కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రవేశ పెట్టేందుకు సమాయత్తం అయింది. 2025-26 వార్షిక బడ్జెట్ రేపు (శుక్ర వారం) ప్రజల ముందుకు రానుంది. బడ్జెట్ లోసంక్షేమం - అభివృద్ధి కి ప్రాధా న్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన లెక్కల ఆధా రంగా కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.
రూ 3.25 లక్షల కోట్లతో..!
ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను రేపు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతి పాదించనున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశ పెడతారు. అదే విధంగా వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు.. మండలిలో నారాయణ ప్రవేశ పెట్టనున్నారు. దాదాపుగా 3.25 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు ముందుగా ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు 50 వేల కోట్ల అంచనాతో తో వ్యవసాయ బడ్జెట్ ఉంటుందని భావిస్తు రు. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటుగా అమరావతికి నిధుల కేటాయింపు కీలకంగా మారుతోంది.

తల్లికి వందనం
ఇక, సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ తల్లికి ఏడాదికి రూ 15 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం అమలు కోసం తాజా లెక్కల మేరకు 69.16 లక్షల మంది అర్హు లుగా గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సుమారు రూ.10,300కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం పైన ప్రకటన చేసారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు రూ 20 వేలు ఇవ్వాల్సి ఉంది.
రైతుల కోసం
అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా అధి కారులు తేల్చారు. ఒక్కో రైతుకు రూ 20 వేలు చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం రూ 10,717 కోట్లు అవసరమని లెక్క వేసారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహా యించటం ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ 14 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇందు కోసం కావాల్సిన మొత్తం 7,502 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభు త్వం బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు చేయనుంది.












Click it and Unblock the Notifications