AP Govt: ఏపీలో ముస్లిం ఉద్యోగులకు ఆ సెలవులో మార్పు..! జీవో జారీ..!
ఏపీలో ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం (ap govt)ఇవాళ ఓ సెలవులో మార్పు చేసింది. రంజాన్ మాసంలో వచ్చే షబే ఖదర్ సందర్భంగా ప్రతీ ఏటా ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఇస్తుంటారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు దీన్ని వినియోగించుకుంటుంటారు. షబే ఖదర్ రాత్రి జాగారం చేసిన ఉద్యోగులకు ఆ తర్వాత రోజు ఈ ఐచ్చిక సెలవు ఇస్తుంటారు. ఇందులో మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ జీవో జారీ చేశారు.
ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ముస్లిం ఉద్యోగులకు షబే ఖదర్ ఐచ్చిక సెలవును మార్చి 15న ప్రకటించారు. అయితే నెలవంక ఆధారంగా జరిగే రంజాన్ మాసంలో భాగంగా ఈ నెల 17న సెలవు ఇవ్వాలని వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి సూచించింది. దీంతో గతంలో ఇచ్చిన మార్చి 15కు బదులుగా మార్చి 17న ఈ సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇవాళ అధికారికంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రతీ ఏటా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వాలు పలు వెసులుబాట్లు ఇస్తుంటాయి. ఇందులో రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షల విరమణ(ఇఫ్తార్ )కు వెళ్లేందుకు వీలుగా సాయంత్రం గంట ముందు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. అలాగే పండుగతో పాటు షబే ఖదర్ సందర్భంగా ఇచ్చే మామూలు సెలవులతో పాటు ఐచ్ఛిక సెలవులు కూడా ఉంటాయి. వీటిని ఉద్యోగులు తమ ఆఫీసుల్లో అధికారులకు సమాచారం ఇచ్చి తీసుకుంటుంటారు.












Click it and Unblock the Notifications