జగన్ నిర్ణయాలు రద్దు - ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అమలు చేసిన పథకాలకు వరుసగా పేర్లు మార్పు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు పథకాలకు పేర్లు ఖరారు చేసింది. వైఎస్పార్ లా నేస్తం పేరు మార్పు చేస్తూ.. న్యాయ మిత్రగా మార్చింది. అదే విధంగా రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవాల కేంద్రాలు మారుస్తూ అధికారికంగా నిర్ణయం ప్రకటించింది.
పేర్లు మార్పు
ఏపీ ప్రభుత్వం గతంలో జగన్ హయాంలో అమలు చేసిన పథకాల పేర్లను పూర్తిగా మార్చాలని డిసైడ అయింది. ఇప్పటికే పలు పథకాల పేర్లను మార్పు చేసింది. ఇప్పుడు తాజాగా వైఎస్పార్ లా నేస్తం పేరు మార్పు చేస్తూ.. న్యాయ మిత్రగా మార్చింది. ఈ పథకం ద్వారా న్యాయ శాస్త్రం పట్టా చేతపట్టుకుని న్యాయవాద వృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ. 5వేలు స్టైపండ్ ఇస్తారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 2019 డిసింబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది.

పథకాల కొనసాగింపు
కూటమి ప్రభుత్వం హామీల, పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని హామీలు, పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ గా ప్రభుత్వం మార్చింది. ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా.. వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా.. వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా.. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా మార్పు చేసింది.
తాజా నిర్ణయాలతో
వీటితో పాటుగా జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. మన బడి - నాడు నేడును మన బడి - మన భవిష్యత్తుగా మార్చారు. జగనన్న ఆణిముత్యాలు పథకం ను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. తాజాగా శాశ్వత భూ హక్కు-శాశ్వత భూ రక్ష పథకం పేరును ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. పథకాలను కొనసాగిస్తూనే కొత్త పేర్లతో అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications