రేవంత్ వ్యాఖ్యలను తప్పు బట్టిన ఏపీ ప్రభుత్వం, అసంబద్దం..!!
తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యల పైన ఏపీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాయలసీమ లిఫ్ట్ పనుల పైన తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తమ విన్నపం మేరకు ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ చెప్పుకొచ్చారు. తన పైన గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రకటన పైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతోంది. స్పష్టత ఇచ్చేందుకు సిద్దమైంది.
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన ప్రకటన పైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన స్టేట్ మెంట్ పైన ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎపి ప్రభుత్వం తప్ప బట్టింది. న విన్నపం మేరకు, తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్దం గా పేర్కొంది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నాటి ప్రభుత్వం చేపట్టిందని వివరించింది. సీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా మాజీ సీఎం జగన్ పనులు చేపట్టారని చెప్పుకొచ్చింది. మాజీ సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

కాగా, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటి సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు చేసిందని గుర్తు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేసారని వివరించింది. 2020లోనే ఈ మేరకు ఎన్టీటి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని తెలిపింది. చంద్రబాబు సెంట్రిక్ గా తెలంగాణ లోని అధికార.. విపక్షాలు రాజకీయాలు నడుపుతూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో వాస్తవాలను ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించేందుకు సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications