కిమ్స్ ఆస్పత్రి కాదు, అందులో డాక్టర్..! ఆదోనీ మెడికల్ కాలేజీ బిడ్ పై మరో షాక్..!

ఏపీలో గత వైసీపీ హయాంలో రాష్ట్రానికి కేటాయించిన మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించిన కూటమి సర్కార్ అందుకు తగ్గట్గుగానే వేగంగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పొరబాటు జరిగిపోయింది. ప్రస్తుతం ఆదోని, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం మెడికల్ కాలేజీలకు బిడ్లు ఆహ్వానించగా.. కేవలం ఆదోని కాలేజీకి మాత్రమే బిడ్ దాఖలైంది. దీనిపైనా వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ కిమ్స్ తో పాటు ప్రభుత్వం కూడా వివరణలు ఇచ్చాయి.

ఆదోనీ మెడికల్ కాలేజీ కోసం తెలుగు రాష్ట్రాల్లో పేరున్న కిమ్స్ ఆస్పత్రి బిడ్ దాఖలు చేసినట్లు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. దీంతో కిమ్స్ ఆస్పత్రికి ఈ మెడికల్ కాలేజీ పూర్తి చేసే సత్తా ఉందని అంతా భావించారు. అయితే తాజాగా కిమ్స్ ఆస్పత్రి దీనిపై ట్విస్ట్ ఇచ్చింది. తాము అసలు ఆదోనీ మెడికల్ కాలేజీ కోసం బిడ్ దాఖలు చేయలేదని, తమకు ఆ ప్రతిపాదన, ఉద్దేశం లేదని తేల్చిచెప్పేసింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.

AP Govt Correction Adoni Medical College Bid Filed by Doctor Not KIMS Hospital

ఈ నేపథ్యంలో వైద్యారోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ ఆదోనీ మెడికల్ కాలేజీ బిడ్ పై స్పందించారు. కిమ్స్ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ టెండర్ వేస్తే కిమ్స్ టెండర్ వేసింది అనుకున్నామని ఆయన చావు కబురు చల్లగా చెప్పారు. కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడని, డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చిందని ఆయన తెలిపారు.
అందుకే కిమ్స్ పేరు మీద టెండర్ వచ్చింది అనుకున్నామని సత్యకుమార్ వివరణ ఇచ్చారు.

AP Govt Correction Adoni Medical College Bid Filed by Doctor Not KIMS Hospital

కిమ్స్ ఆసుపత్రి పేరు మీద టెండర్ అనేది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే అని వైద్యారోగ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ కోసం కిమ్స్ ఎలాంటి బిడ్ వేయలేదని మంత్రి సత్య కుమార్ తేల్చిచెప్పేశారు. దీంతో కిమ్స్ ఇచ్చిన వివరణ నిజమేనని తేలిపోయింది. ఇప్పటికే మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో నిర్మించాలని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్స్ లో పనిచేసే డాక్టర్ ఏకంగా ఓ మెడికల్ కాలేజ్ కట్టేందుకు బిడ్ వేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+