అమరావతి ప్లాన్ ఖరారు - ఏ నిర్మాణం ఎక్కడ..!!

ఏపీ రాజధాని అమరావతి పై ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెలాఖరులోగా నిర్మాణాల కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించింది. జనవరి నుంచి నిర్మాణాలు మొదలు పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రపంచ బ్యాంకు రుణం పైన ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలో అధికారికంగా ఒప్పందం జరగనుంది. ఇదే సమయంలో రాజధాని ప్లాన్ ఖరారైంది. ఏ జోన్ లో ఏ నిర్మాణం చేపట్టాలనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.

13 జోన్లుగా ఖరారు
అమరావతిలో గత హయాంలోనే నవ నగరాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు, అమరావతి నగరాన్ని 13 జోన్లుగా ప్రభుత్వం విభజించింది. తాజాగా నిర్ణయించిన జోన్ల విధానంలో ఒకటి నుండి 12 జోన్లు ఏర్పాటు చేసి మరొక జోన్‌ను 12ఏగా పేర్కొన్నారు. నెదర్లాండ్స్‌ సహకారంతో కాలువలు, రిజర్వాయర్లు నిర్మించాలనుకున్న ప్రాంతమంతా ప్రాధాన్యత జోన్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి చేయానుకున్న జోన్లలో 1,2,3,6,7,10జోన్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటీ రెండు జోన్లు అనంతవరం, శాఖమూరు పరిధిలో ఉండగా అక్కడ క్రీడా పాలసీని అమలు చేయనున్నారు. ఈ రెండు జోన్లలో కలిపి 4237.34 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది.

AP govt decided new zones for Construction of Amaravati details here

ఆరు ప్రాధాన్యత జోన్లు
ఆరు జోన్లను ప్రాధాన్యత జోన్లుగా గుర్తించింది. అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్‌ ఏరియాను రెండు జోన్లుగా విభజించారు. మొత్తం ఆరు జోన్లలో 12,894 ఎకరాలను తొలిదశలో అభివృద్ధి చేయనున్నారు. దీనిలో అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్‌(ఎజిసి)కి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఏడో జోన్లో లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇది 2060.13 ఎకరాల్లో ఉంది. పదోజోన్‌ పరిధిలో నీరుకొండ, ఐనవోలు, కురగల్లు ప్రాంతాలున్నాయి. ఇక్కడ రిజరాయర్లు, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

త్వరలో టెండర్లు
పదో జోన్‌ లో మొత్తం 2355.52 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. వీటిల్లో ఆరోజోన్‌ పరిధిలో పాలవాగు రిజర్వాయర్‌, పదోజోన్‌ పరిధిలో కొండవీటివాగు రిజర్వాయర్‌ నిర్మించనున్నారు. వీటికితోడు అమరావతి సీడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారు. త్వరలోనే వీటికి సంబంధించి టెండర్లు పిలవనున్నారు. వాటర్‌బాడీస్‌ కూడా ఈ జోన్లోనే ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో ముఖ్యంగా రిజర్వాయర్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+