పేదలకు ఇళ్ల పంపిణీ ముహూర్తం ఖరారు, దక్కేది వీరికే - నిబంధనలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల మంజూరు కు ముహూర్తం ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. పంపిణీ ముహూర్తం లోగా లక్ష్యంగా మేరకు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో, సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న లబ్దిదారులు గృహప్రవేశాలు చేయనున్నారు

శ్రావణ మాసంలో
ఏపీ ప్రభుత్వం పేదలకు వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహప్రవేశాలు చేయించాలని నిర్ణ యించింది. సీఎం చంద్రబాబు పేదల ఇళ్లను ప్రారంభించనున్నారు. అప్పటిలోగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎన్నికల సమయం లో పేదలకు ఇంటి నిర్మాణం పైన ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత 13 నెలల్లో 2.30 లక్షల గృహనిర్మాణాలు పూర్తయ్యాయి. రూఫ్​ స్థాయిలో 87,000 ఇళ్లు ఉన్నాయి. లింటెల్ స్థాయిలో 1.2 లక్షల ఇళ్లు ఉండగా, బేస్​మెంట్​ స్థాయిలో ఏమో 50,000 ఇళ్లు ఉన్నాయి. మిగతా వాటికి పునాదు లు కూడా వేయలేదు. వాటిని కూడా పూర్తి చేయించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీంతో, ఇప్పుడు ముహూర్తం ఖరారు చేయటంతో అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు.

ap-govt-decided-to-begin-houses-distribution-for-poor-in-next-month

ఒక్కో ఇంటి కోసం
కేంద్ర ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున అంది ది. గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 1000 చెల్లిస్తోంది. ఇదికాకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజను రూ.లక్ష అదనపు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే సుమారుగా లక్ష మంది లబ్ధిదారులకు రూ.300 కోట్ల వరకు మంజూరు చేసింది. వారిలో 50 వేల మంది ఇళ్ల నిర్మాణాన్ని పునఃప్రారం చినట్లు అధికారులు గుర్తించారు.ప్రభుత్వం అదనపు సహాయం అందించినప్పటికీ నిర్మాణం ఎందుకు చేపట్టలేదో మిగిలిన వారి నుంచి ఆరా తీస్తున్నారు.

నిబంధనలు
అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని అందించే అంశంపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. కేయించిన ప్లాట్లకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ జారీ చేస్తుందని ఉత్తర్వులో వెల్లడించారు. ఈ కన్వేయన్స్ డీడ్ 10 సంవత్సరాల వ్యవధితో ఫ్రీ హోల్డ్ హక్కులను అందిస్తుందని స్పష్టం చేశారు. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉచిత ఇళ్ల పట్టా ఇచ్చేలా విధివిధానాలను రూపొందిం రు. ఇంటి పట్టా ఇచ్చిన రెండు సంవత్సరాల లోగా గృహ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. బీపీఎల్ కుటుంబాలకు దిగువ ఉన్నవారికి మాత్రమే ఇంటి స్థలం ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+