ఫీజు రీయింబర్స్​మెంట్ నిధుల విడుదల పై బిగ్ అప్డేట్..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చి ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంటున్న ప్రభుత్వం ప్రాధాన్యత అంశాల పైన ఫోకస్ చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ పథకాల అమలు పైన చర్చించింది. అదే సమయంలో విద్యా ర్ధులకు ఫీజు రీయింబర్స్​మెంట్ నిధుల పైనా చర్చ జరిగింది. తొలి విడతగా కొంత మేర నిధులు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్దిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి వేళ ఈ నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఫీజు రీయింబర్స్​మెంట్ విధానంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. గత ప్రభుత్వ హయాంలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్​మెంట్ నిధులు జమ చేసేవారు. ఇప్పుడు నేరుగా కాలేజీ యాజమాన్యాలకే ప్రభుత్వం ఫీజు రీయింబ ర్స్​మెంట్ నిధులు జమ చేయాలని నిర్ణయించింది. పెద్ద మొత్తంలో ఈ నిధులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో, యాజమాన్యాలకు భరోసా కల్పించేలా ముందస్తుగా కొంత మొత్తం విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో, ఫీజు చెల్లింపుల నేపథ్యంలో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

AP govt decided to release fee Reimbursement arrears in next week in college Accounts

ఫీజు బకాయిల చెల్లింపు పైన వైసీపీ నిరసనలకు నిర్ణయించింది. ఈ అంశం పైన తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. మంత్రి లోకేష్ ఈ అంశం పైన ప్రస్తావన చేసారు. రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్​మెంట్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

నిధుల విడుదలకు ఆమోదం తెలపాలని కోరగా సీఎం వెంటనే స్పందిస్తూ ప్రాధాన్యతా క్రమంలో విడుదల చేయాలని సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన విధంగా విద్యార్థుల ఖాతాల్లోకి నమోదు చేయాలని కోరారు. నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అప్పటి వరకు విద్యార్ధులకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడతల వారీగా నిధులు చెల్లిస్తే యాజమాన్యాలకు సైతం ఆర్థిక భారం తగ్గుతుందని, ప్రభుత్వం ఆ భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలోనూ ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విధానంలో గత ప్రభుత్వం అమలు చేసిన విధానానికి స్వస్తి పలికి గతంలో మాదిరిగా విడతల వారీగా ఫీజు బకాయిలు కళాశాలల యాజమాన్య ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+