Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఉత్తర్వులతో డిఫెన్స్ లో పడ్డ పవన్?- వాట్ నెక్స్ట్?

Kapu Reservations: కాపు రిజర్వేషన్ ఉద్యమ కేసుల ఎత్తివేతపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎత్తివేతపై హైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

2022లో ఎత్తివేత..

కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఏ ఒక్క కేసు లేకుండా అన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఓ జీవోను విడుదల చేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచింది. పోలీస్ స్టేషన్ల పేర్లు, కేసు నంబర్ల జాబితాను ప్రకటించింది.

AP Govt decides to appeal on the verdict on the cases against Kapu activists

ఆ హామీ అమలు కోసం..

తమకు రిజర్వేషన్ కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే- కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాంటూ 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

తుని సభలో..

ఆ హామీ ఎంతకూ అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ ప్రముఖ కాపు నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆ సామాజిక వర్గ ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తుని సభ నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.

కాపు రిజర్వేషన్ ఉద్యమంపై..

ఈ అల్లర్లలో రత్నాచల్ రైలును కూడా తగులబెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో.. వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తరువాత కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు రిజిస్టర్ అయ్యాయి.

కేసులు ఇవే..

తునిలో రైలును తగులబెట్టడం, స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడులు చేయడం వంటి ఘటనలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్‌మెంట్, అప్పటి ఐపీసీ సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు. ఐపీసీలోని 109, 143, 147, 148, 149, 353, 440, 427, 435 వంటి కేసులు నమోదయ్యాయి.

తొలిదశలో..

2019 తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కేసుల ఉపసంహరణ మొదలైంది. తొలిదశలో తుని బహిరంగ సభ, రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్‌పై దాడులకు సంబంధించిన కేసులను ప్రభుత్వం ఇదివరకు ఎత్తివేసింది. 2020 జులైలోనే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది ప్రభుత్వం.

2016 జనవరి నుంచి 2019 వరకు

ఆ తరువాత అంటే తుని బహిరంగ సభ జరిగిన 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. వాటి వివరాలను ఇందులో పొందుపరిచింది. తుని ఘటనకు సంబంధించిన కేసులను మాత్రమే కాకుండా- రాష్ట్రవ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ ఉపసంహరించున్నట్లు ప్రకటించింది.

పోలీస్ స్టేషన్లు ఇవే..

2019 మార్చి వరకు 161 కేసులు నమోదూనట్లు పేర్కొన్నారు. ఎల్ పోలవరం, కాట్రేనికోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పీ గన్నవరం, రాజోలు, నగరం, మలికిపురం, భిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్లల్లో ఆయా కేసులు నమోదు కాగా వాటిని ఎత్తివేసింది.

అప్పీల్ చేయాలని

ఇప్పుడు వాటన్నింటిపైనా అప్పీల్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు పై అప్పీల్ కి వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ చెయ్యాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ తాజాగా హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

పవన్ పై

కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కల్యాణ్.. ప్రసుత్తం ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారాయన. తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారులపై ఎత్తివేసిన కేసులపై అప్పీల్ కు వెళ్లాలని తాజాగా హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన ఎలా స్పందిస్తారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+