ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్- బేసిక్ పే లో..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో పలు సానుకూల నిర్ణయాలను తీసుకుంటూ వస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా.. ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించేలా ఆ నిర్ణయాలు ఉంటోన్నాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్న విషయాన్ని తెలిసిందే. వారి డిమాండ్లను అంగీకరించింది. ఇదివరకు రెగ్యులర్ ఉద్యోగులకు తొమ్మిది శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపైనా జగన్ ప్రభుత్వం మరోసారి సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. వారి వేతనాలను 37 శాతం మేర పెంచింది.

కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్దీకరించనున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ వైఎస్ జగన్ నిర్ణయం ఈ మధ్యాహ్నమే నిర్ణయం తీసుకున్నారు. 2014 జూన్ 2వ తేదీకి ముందు నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని వెల్లడించారు. ఈ విషయంలో అయిదేళ్ల నిబంధనను సైతం తొలగిస్తున్నట్లు చెప్పారు.
12వ పే రివిజన్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా అపాయింట్ చేసింది. ఈ 12వ పీఆర్సీ కమిషన్ తన నివేదికను అందజేయడానికి ప్రభుత్వం గడువు విధించింది. ఏడాదిలోగా వివిధ అంశాలపై అధ్యయనం చేసి సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖకు తన నివేదికను అందజేయాల్సి ఉంటుందని సూచించింది.

ఈ క్రమంలో- తాజాగా మరో నిర్ణయాన్ని కూడా ప్రకటించింది జగన్ సర్కార్. సీపీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తీపి కబురు ఇది. గ్యారంటీ పెన్షన్ స్కీంలో మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా- రిటైర్మెంట్ నాటి బేసిక్ పేలో 50 శాతం గ్యారంటీ పెన్షన్ ఇవ్వనుంది.
అలాగే- ఉద్యోగి వార్షిక చెల్లింపుల్లో లోటు ఉంటే దాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. జీపీఎస్ ఉద్యోగుల జీవిత భాగస్వామికి 60 శాతం పెన్షన్‌ను అందించాలని నిర్ణయించింది. యాన్యుటీలో లోటు ఉంటే కూడా ప్రభుత్వమే దాన్ని భరిస్తుంది. ఆ లోటును భర్తీ చేస్తూ ఉద్యోగులకు పూర్తి యాన్యుటీ మొత్తాన్ని చెల్లిస్తుంది. ద్రవ్యోల్బణం, అప్పటి ధరల ఆధారంగా బేసిక్ పేను నిర్ధారించేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.












Click it and Unblock the Notifications