ఉద్యోగులకు ప్రభుత్వం క్లారిటీ - సీపీఎస్ పై తాజాగా: కీలక నిర్ణయం..!?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది.ఉద్యోగ సంఘాలు ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించనున్నాయి.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. పెండిండ్ బకాయిల చెల్లింపు పైనా హామీ దక్కింది. ఈ నెలాఖరులోగా మూడు వేల కోట్ల మేర బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిది. మిగిలిన బకాయిలు రెండు విడతల్లో సెప్టెంబర్ లోనూ చెల్లిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా ఉద్యోగులు ప్రస్తావిస్తున్న ఇతర అంశాల పైన చర్చల సమయంలో హామీ ఇచ్చింది. ఇవే డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి చర్చల మినిట్స్ అందాయి. దీంతో..ఉద్యోగ సంఘాలు ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించనున్నాయి.

ప్రభుత్వ హామీ- అందిన మినిట్స్

ప్రభుత్వ హామీ- అందిన మినిట్స్

పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటుగా తమ సమస్యలను పరిష్కారం కోరుతూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దమయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు చేసారు. బకాయిల చెల్లింపు పైన హామీ ఇచ్చింది. అందులో భాగంగా రూ 3 వేల కోట్లు ఈ నెలలోనే చెల్లించనున్నట్లు స్పష్టత ఇచ్చింది. ఉద్యోగులకు సంబంధించి డీఏ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలు చెల్లించేందుకు సమయంలో కూడిన స్పష్టత లభించింది. సెప్టెంబర్ లోగా రెండు విడతలుగా క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. చర్చలు సానుకూలంగా జరిగినందుకు ఉద్యమ కార్యాచరణ నిలిపివేయాలని మంత్రి వర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాలను కోరింది. చర్చల్లో తీసుకున్న నిర్ణయాల పై మినిట్స్ అందించాలని..సంఘాలతో చర్చించి నిర్ణయ తీసుకుంటామని సంఘాల నేతలు చెప్పారు.

అందిన మినిట్స్.. కార్యాచరణ వాయిదా..!

అందిన మినిట్స్.. కార్యాచరణ వాయిదా..!

ప్రభుత్వంతో జరిగిన చర్చల మినిట్స్ ఉద్యోగ సంఘ నేతలకు రాత్రి పొద్దు పోయిన తరువాత అందాయి. జేఏసీ నేతలకు ప్రభుత్వం వీటిని పంపింది. వీటి పైన ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు చేస్తున్నారు. ఈ ఉదయం మరోసారి సమావేశమై ఉద్యమ కార్యాచరణ పైన తమ నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావటంతో పాటుగా..ఉద్యోగ సంఘాలు కోరిన విధంగా మినిట్స్ ఇవ్వటంతో ఉద్యమం వాయిదా వేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. బకాయిలు, డిఏ చెల్లింపులు, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ , హెల్త్ కార్డుల అంశంలోనూ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నెల 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో హెల్త్ కార్డు సమస్యలపైన సమావేశం ఏర్పాటు చేసారు.

సీపీఎస్ పైన తాజా ప్రతిపాదనలు

సీపీఎస్ పైన తాజా ప్రతిపాదనలు

మరో ప్రధానమైన డిమాండ్ సీపీఎస్ రద్దు పైన తాజాగా చర్చలు జరిగాయి. ఇదే అంశం పైన తాజాగా మరోసారి చర్చలు జరిగాయి. సీపీఎస్ స్థానంలో బెటర్ పెన్షన్ స్కీం (బీపీఎస్) ను తీసుకొచ్చే ప్రతిపాదన పైన చర్చలు జరిగాయి. ఉద్యోగులకు ఎక్కడా నష్టం లేకుండా ఈ విధానం పైన ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. దీని పైన మరోసారి త్వరలోనే సమావేశం జరగనుంది. సాధ్యమైనంత త్వరగా సీపీఎస్ అంశానికి ముగింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోగా దీని పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, తాజాగా ప్రభుత్వం నుంచి ఉద్యోగుల బకాయిల చెల్లింపు..ఇతర అంశాల పైన హామీలతో ఉద్యోగ సంఘాల నేతలు తమ ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+