చంద్రబాబు కీలక ప్రతిపాదనలు - మోదీ లెక్కే వేరు..!!

Union Budget 2025: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కేదేంటి. ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్డెట్ పద్దులు సిద్ధమయ్యాయి. నేడు ప్రవేశ పెట్టే 2025-26 బడ్జెట్ పైన సీఎం చంద్రబాబు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏపీకి కావాల్సిన సాయం పైన ప్రధాని, నిర్మలా సీతారామన్ కు వినతు లు సమర్పించారు. కేంద్రలో భాగస్వామిగా ఉండటంతో ఏపీకి ప్రాధాన్యత దక్కుతుందనే భావన తో కూటమి నేతలు ఉన్నారు. దీంతో, ఏపీ ప్రభుత్వం ఈ బడ్జెట్ రాష్ట్రానికి చేసే కేటాయింపుల పైన భారీ అంచనాలతో కనిపిస్తోంది. మరి.. బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి..

ఏపీ ప్రభుత్వం అంచనాలు
ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ కేటాయింపుల పైన భారీ అంచనాలతో ఉంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీ కి సంబంధించిన కేటాయింపుల పైన మధ్నాహ్నం పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలని ఏపీ ఆర్దిక శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది. 2024 ఎన్నికల తరువాత కేంద్రం - రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉండటంతో... ఈ సారి కేటాయింపులు పెరుగుతాయని భావిస్తున్నారు. కొంత కాలంగా ఏపీ విషయంలో కేంద్రం కీలక అంశాల్లో సానుకూలంగా స్పందిస్తోంది. దీంతో, బడ్జెట్ లో కేటాయింపుల పైన తాము కోరిన విధంగా కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తోంది. అందు లో భాగంగా నదుల అనుసంధానం, టెక్ట్స్‌టైల్స్‌ పార్కుల ఏర్పాటుకు తోడ్పాటు ఉంటుందని భావిస్తోంది.

AP govt expecting huge allocations for the state in Union Budget to bail it our from financial stress

పూర్వోదయ పథకం
కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆర్దిక మంత్రి కేశవ్ ఢిల్లీలో జరిగిన సమావేశంలో పలు అంశాలను ప్రతిపాదించారు. నదుల అనుసంధానానికి సాయం చేయాలని కోరారు. 2024-25 బడ్జెట్‌లో బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి కేంద్రం పూర్వోదయ ప్రాజెక్టును ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ. కోస్తాం ధ్ర తుఫాన్లతో, రాయలసీమ ప్రాంతం కరువు తో ఇబ్బంది పడే అంశాలను వివరించారు. రాష్ట్ర విభజన వల్ల కూడా మాకు నష్టం వాటిల్లిందని లెక్కలతో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పూర్వో దయ ప్రాజెక్టులో ఉన్న ఏపీకి కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటిలో 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని ప్రతిపాదించారు.

కేంద్రానికి ప్రతిపాదనలు
అదే విధంగా ఏపీలో రోడ్లు, రేవులు, విమానాశ్రయాల నిర్మాణానికి సాయం చేయాలని కేంద్ర ఆర్దిక మంత్రిని కోరారు. పీపీపీ ప్రాజెక్టులన్నింటికీ వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) భరించాలని కేవశ్ అభ్యర్ధించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రమే వీజీఎఫ్‌ భరించాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోంది. అదే విధంగా ప్రతిపాదించిన జిల్లాలకు జల్‌జీవన్‌ మిషన్‌, ఇతర ఇరిగేషన్‌ పథకాల ద్వారా కేంద్రం 90 శాతం, రాష్ట్ర 10 శాతం నిష్పత్తిలో నిధులు అందించాలని కోరారు. ఏఐ, ఏవియేషన్‌ యూనివర్సిటీ, పునరుత్పాదక శక్తి వనరులపై పరిశోధన లు చేసే విశ్వవిద్యాలయాలకు ఒక్కొక్క ప్రాజెక్టుకు రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలి అని ప్రభుత్వం ప్రతిపాదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+